'బావ బావమరిది', 'పల్నాటి పౌరుషం' వంటి తెలుగు చిత్రాల్లో బాలనటుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఆ తర్వాత తమిళంలో 'జయం' రీమేక్ చిత్రంలో కథానాయకుడిగా నటించి అలరించారు. తాజాగా ఆయన 'విశ్వాసం' చిత్రం సహ-రచయిత అయిన ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలొస్తున్నాయి.
ఆంటోనీ చెప్పిన కథ నచ్చడం వల్ల జయం రవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సినిమాను జులైలో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వినికిడి. ఇందులో జయం రవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారట. సినిమాకి సంబంధించిన తారాగణం, సాంకేతిక సిబ్బంది మొత్తం ఖరారైన తర్వాత ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేయనునున్నారని సమాచారం. ప్రస్తుతం జయం రవి - మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కతున్న భారీ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో రాజరాజచోళన్‌గా నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఇది పోరాటం కాదు.. మహా సంగ్రామం..