ETV Bharat / sitara

'రౌడీ హీరో'తో నటించాలని ఉంది: 'జాతిరత్నాలు' హీరోయిన్​ - జాతిరత్నాలు హీరోయిన్​ ఫారియా అబ్దుల్లా

విజయ్ ​దేవరకొండతో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పింది 'జాతిరత్నాలు' హీరోయిన్​ ఫారియా అబ్దుల్లా. సైకో పాత్ర పోషించడం తన డ్రీమ్​ రోల్​ అని తెలిపింది. దీంతో పాటు ఈ చిత్ర విశేషాలను పంచుకుంది. అవేంటో చూద్దాం.

faria
ఫారియా అబ్దుల్లా
author img

By

Published : Mar 2, 2021, 4:54 PM IST

మరో తెలుగు అందం త్వరలోనే వెండితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాటతో యువతను తనవైపు తిప్పుకుంది. ఆ భామ ఎవరో కాదు ఫారియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' సినిమాతో నాయికగా పరిచయమవుతోంది. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రమిది. మార్చి 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఫారియా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

జాతిరత్నాలు హీరోయిన్​ ఫారియా అబ్దుల్లా

తెలుగు నేర్చుకుంటున్నా..

నా స్వస్థలం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌. కానీ, తెలుగు భాష అంతగా రాదు. సినిమా కోసం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్‌, సంగీతం, నృత్యం.. అన్నింటినీ ప్రయత్నించాను. డ్యాన్సర్‌ కావాలనుకున్నాను కానీ నటనవైపు వెళ్లడంతో ఆ కల అలానే ఉండిపోయింది. మోడలింగ్‌ కూడా చేశాను.

అవకాశం అలా అందుకున్నా..

దాదాపు ఏడేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాను. 50 స్టేజ్‌ షోల్లో పాల్గొన్నాను. మరో అడుగు ముందుకేసి ‘నక్షత్ర’ అనే వెబ్‌ సిరీస్‌తో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. హైదరాబాద్‌లోని లయోలా కాలేజీలో చదువుతున్న రోజుల్లో దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఓ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమంలో నేను స్పీచ్‌ ఇచ్చాను. అది చూసిన అశ్విన్‌ నన్ను కలిసి ఏమవ్వాలనుకుంటున్నావ్‌? అని అడిగారు. నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ని, నటి కావాలనుకుంటున్నా అని చెప్పాను. ఆ తర్వాత ఆడిషన్‌కి పిలిచారు. అలా ఈ అవకాశం దక్కింది. ఈ సినిమాలోని నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.

చిట్టి కోసం..

జాతిరత్నాలు ప్రస్తుత సమాజ ధోరణిని ప్రతిబింబిస్తుంది. చిట్టి పాత్ర స్మార్ట్‌, అమాయకత్వంలో కూడినది. ఈ పాత్రలో ఒదిగిపోయేందుకు దర్శకుడి దగ్గర సలహాలు సూచనలు తీసుకుని, సెట్‌కి వెళ్లేముందు కొంచెం రిహార్సల్‌ చేసేదాన్ని. ఇందులో నా పాత్రకు సంబంధించి నవీన్‌తో ఎక్కువ సన్నివేశాలుంటాయి. మంచి సహనటుడు. మొదట్లో నాకు ఈ మాత్రం కూడా తెలుగు రాక ఇబ్బంది పడుతుంటే 'ఫర్వాలేదు ఇలా చేయ్‌.. అలా చేయ్‌' అని సపోర్ట్‌ చేశాడు. తొలి సినిమానే పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. రథన్‌ సంగీతం అద్భుతం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరిన్ని విశేషాలు

స్టేజీ షో కంటే సినిమానే నాకు తేలిక అనిపించింది. నాకు ఆర్టిస్ట్‌లతో మాట్లాడటం చాలా ఇష్టం. వాళ్ల జీవితం, ఎలా స్ఫూర్తిపొందుతారో తెలుసుకుంటుంటా.

ఇష్టమైన నటుడు: ఫహద్‌ ఫాజిల్‌

ఎవరితో సినిమా చేయాలనుంది: విజయ్‌ దేవరకొండ

డ్రీమ్‌ రోల్‌: సైకో.

ఇదీచూడండి: లైఫ్ అండ్ డెత్ సమస్యలో 'జాతి రత్నాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.