ETV Bharat / sitara

వాళ్లే అసలైన 'జాతి రత్నాలు': నవీన్ పొలిశెట్టి​ - naveen polishetty

సినీ పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం‌ లేని నటులకు ఇలాంటి సదవకాశం ఇచ్చిన తన చిత్ర నిర్మాతలే అసలైన 'జాతి రత్నాలు' అని అన్నారు హీరో నవీన్​ పొలిశెట్టి. ఆయన నటించిన 'జాతిరత్నాలు' సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

naveen
ననీన్​
author img

By

Published : Mar 10, 2021, 9:46 PM IST

Updated : Mar 11, 2021, 6:40 AM IST

"నా పేరు తెలియకపోయినా అందరూ నన్ను ఏజెంట్‌ అని పిలుస్తున్నారు. ఆ ముద్ర పోగొట్టుకునేందుకు, మరో విభిన్న పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు వచ్చిందే ఈ 'జాతి రత్నాలు' కథ" అన్నారు యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు నవీన్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నటుడిగా సంతృప్తి..

నా తొలి రెండు చిత్రాలు 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'చిచ్చోరే' హిట్‌ అయ్యాయి. దాంతో మూడో చిత్రంపై కాస్త ఒత్తిడి ఉండేది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే మంచి కథ కోసం ఎదురుచూశాను. ఓ సారి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఫోన్‌ చేసి ఓ కథ విని, నువ్వు చేస్తే బాగుంటుందన్నారు. సరే అని దర్శకుడు అనుదీప్‌ని కలిశాను. ఆ కథ చెప్తున్నప్పుడే అందులోని జోగిపేట శ్రీకాంత్‌ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. నా పేరు ఎవరికీ తెలీదు కానీ నేనెక్కడికెళ్లినా ఏజెంట్‌ అనే పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్ర ప్రభావం చూపింది. అలా అని అదే తరహాలో మరో చిత్రం చేస్తే కొత్తేమీ ఉండదు. ఎలాంటి పాత్ర పోషిస్తే దీన్ని నుంచి బయటపడొచ్చు అనుకుంటున్నప్పుడు ఈ కథ వచ్చింది. ఇది అయితేనే ఏజెంట్‌ని మరిపిస్తుందనిపించింది. నటుడిగా నాకూ సంతృప్తి ఉంటుందని ఓకే చేశాను. తర్వాత డ్రీమ్‌ ప్రాజెక్టులా మారిపోయింది.

ఇది వ్యంగ్యాత్మకం..

దేశానికి సేవ చేసిన వాళ్లని, గొప్ప గొప్ప వాళ్లని ‘జాతి రత్నాలు’ అని పిలుస్తుంటారు. కానీ, ఈ చిత్రంలోని పాత్రలకు సరిపోతుందని మేము వ్యంగ్యంగా ఈ పేరు పెట్టాం. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని నటుల్ని ఎంపిక చేసుకుని ఇలాంటి సదవకాశం ఇచ్చిన మా నిర్మాతలే (స్వప్న, ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌) అసలైన జాతి రత్నాలు. ప్రతిభను గుర్తించి మాపై నమ్మకంతో రూపొందించారు.

రెండు మూడు సార్లు..

చిత్రీకరణకు వెళ్లే ముందు రోజు రాత్రి సన్నివేశానికి తగిన సంభాషణలు ప్రిపేర్‌ అవడం నాకు అలవాటు. చిత్రీకరణ సమయంలో అనుదీప్‌ హడావిడి చేసేవాడు (నవ్వుతూ..). సీన్‌ పూర్తవకముందే కట్‌ చెప్పేసి మరొకటి తీద్దాం అనేవాడు. నాకేమో ఒకే సన్నివేశాన్ని రెండు మూడు రకాలుగా చేసి ఎడిటింగ్‌ సమయంలో ఏది బాగుంటే అది ఓకే చేయాలనిపించేది.

కథతోపాటు కామెడీ..

కథలోంచి కామెడీ పుడుతుంది తప్ప కామెడీ కోసం తీసిన సినిమా కాదు. ఇందులోని పాత్రలు అమాయకంగా ఉంటూనే పక్కన వాళ్లని భయపడేలా చేస్తాయి. రాహుల్‌, ప్రియదర్శి సెట్‌లో చాలా సరదాగా ఉండేవాళ్లు. ఈ ఇద్దరి టైమింగ్‌కి తగినట్టు స్పాట్‌లోనే చాలా సన్నివేశాలకి మెరుగులుదిద్దాం. ట్రైలర్‌ చూసి ఈ చిత్రం కొత్తగా ఉందనుకుని ప్రేక్షకుల థియేటర్‌కి రావాలి. అలా చేసిన ప్రయత్నమే ఇది. కరోనా కారణంగా వచ్చిన ప్రతి ఒక్కరి ఒత్తిడిని ఈ సినిమా తగ్గిస్తుంది. ప్రేక్షకులు తమ కష్టాలు కాసేపు పక్కన పెట్టి వినోదాన్ని ఆస్వాదిస్తే చాలు.. నటుడికి కావాల్సిన రెమ్యునరేషన్‌ అంతకుమించి ఏం ఉంటుంది.

మార్పు కనిపించింది..

లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీలో నటించేందుకు అవకాశాలొచ్చాయి. కానీ, నాకే రిస్క్‌ ఎందుకని చేయాలనిపించలేదు. షూటింగ్‌కి ఎక్కడెక్కడికో వెళ్లాలి. నా వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదనుకున్నాను. అందుకే ఇంట్లోనే ఉండి యూ ట్యూబ్‌ వీడియోస్‌ చేశాను. ఆ సమయంలో వ్యక్తిగతంగా నాలో చాలా మార్పు చూశాను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు ఓకే చేశాను. ఓ నటుడిగా ఏ ఎమోషన్‌ అయినా.. ఏ నేపథ్యం అయినా చేయగలగాలనేది నా అభిప్రాయం. దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, జోయా అఖ్తర్‌, రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఉంది.

Last Updated : Mar 11, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.