ETV Bharat / sitara

'జాతిరత్నాలు కథ అలా పుట్టింది' - జాతిరత్నాలు అనుదీప్ దర్శకుడు

నవీన్​ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్​ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. దీంతో పాటు ఆయనకు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

jatiratnalu
జాతిరత్నాలు
author img

By

Published : Mar 9, 2021, 8:47 PM IST

'గతంలో నేను తెరకెక్కించిన లఘు చిత్రం వల్లే జాతిరత్నాలు అవకాశం వచ్చింది' అన్నారు దర్శకుడు అనుదీప్‌ కె.వి. 'పిట్టగోడ' తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలవుతున్న నేపథ్యంలో విలేకరులతో సంభాషించారు అనుదీప్‌.

anudeep
అనుదీప్​

అలా కుదిరింది..

ముగ్గురు అమాయకులు ఓ నేరంలో ఇరుక్కుంటే? చట్టాలపై అవగాహన లేని వాళ్లు పోలీసు స్టేషన్‌, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తే ఎలా స్పందిస్తారు? అనే ఆలోచనలో పుట్టిందీ కథ. పదేళ్ల క్రితం నేను తీసిన ఓ లఘు చిత్రం నాగ్‌ అశ్విన్‌కి బాగా నచ్చడం వల్ల నాతో సినిమా చేయాలనుకున్నారు. 'పిట్టగోడ' పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో నన్ను సంప్రదించారు. తొలి సినిమా ఫ్లాప్‌ అయినా నాకు ఇంతటి అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

మీరే చెప్తారు..

నవీన్‌ పొలిశెట్టిని నాగ్‌ అశ్విన్‌ ఎంపిక చేశారు. రాహుల్‌, ప్రియదర్శి కలయికలో కొన్ని చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో చేయడం కంటే కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆడిషన్‌ చేశాం. కానీ, కుదరలేదు దాంతో వీళ్లనే తీసుకున్నాం. ఈ పాత్రలు సీరియస్‌గానే ఉంటాయి.. ప్రేక్షకులకు మాత్రం నవ్వులు పంచుతాయి. ప్రధాన పాత్రలు నాలుగు మాత్రమే కాదు చిన్న చిన్న పాత్రలకూ మంచి గుర్తింపు ఉంటుంది. సినిమా చూశాక ఈ మాట మీరే చెప్తారు!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్ అనుభూతి కోసమే..

నేనూ నాగ్‌ అశ్విన్‌, సమర్‌ మేం ముగ్గురం ఈ కథని డెవలప్‌ చేశాం. నాగ్‌ అశ్విన్‌ అంత పెద్ద దర్శకుడైనా చాలా స్నేహంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సరదాగా తెరకెక్కించాం. లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీ నుంచి అవకాశం వచ్చినా ప్రేక్షకులకి థియేటర్‌ అనుభూతి ఇవ్వాలనే ఇంతకాలం వేచి చూశాం.

బ్రహ్మానందం పాత్ర అలా..

సంగీత దర్శకుడి ఎంపిక ప్రక్రియలో చాలామందిని అనుకున్నాం. చివరకు రథన్‌ని ఎంపిక చేశారు అశ్విన్‌. కథలో మూడు పాటలకే స్కోప్‌ ఉంది. పాటలతోపాటూ నేపథ్య సంగీతమూ అద్భుతంగా అందించాడు రథన్‌. జడ్జి పాత్రకు సంబంధించి ముందుగా రెండు డైలాగులు రాసుకున్నాం. ఈ పాత్ర పోషించేందుకు బ్రహ్మానందం అయితే బాగుంటుందని స్వప్న సూచించడం వల్ల ఆయనకు తగ్గట్టు స్ర్కిప్టులో కొన్ని సన్నివేశాలు పెంచాం. సుమారు 20 నిమిషాల నిడివి ఉంటుందా పాత్ర.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో..

నేను హారర్‌, హింస నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించలేను. కామెడీ, డ్రామా చేయగలను. లాక్‌డౌన్‌లో కొన్ని కథలు సిద్ధం చేశాను. వాటిలో మార్షల్‌ ఆర్ట్స్‌తో కూడిన కామెడీ కథ ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఈటీవీలో ప్రసారమైన 'క్యాష్'‌ కార్యక్రమంలో నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. అది చూసిన వాళ్లంతా క్యాష్‌ అనుదీప్‌ అంటున్నారు. అసలు నేను ఆ షోకు రావాలని అనుకోనేలేదు. ఎందుకంటే నాకు కెమెరా ముందుకు రావాలంటే భయం. నా స్థానంలో చిత్రబృందంలో మరొకరు వెళ్తారేమోనని చాలామందికి ఫోన్‌ చేశా. కానీ, అది కుదరకపోవడం వల్ల చివరకు నేనే వెళ్లాను.

ఇదీ చూడండి: 'జాతిరత్నాలు' చిట్టి.. లక్ష్మి పటాస్ లాంటి నవ్వుతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.