ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే తమ ధ్యేయమని, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుల శైలిలో తమ సినిమా అలరిస్తుందని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయన నిర్మాతగా మారి తెరకెక్కించిన 'జాతిరత్నాలు'.. మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన పాత్రధారులు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, దర్శకుడు అనుదీప్ హాజరయ్యారు. రధన్ సంగీతమందించిన 'జాతిరత్నాలు'లోని 'చిట్టి'తో పాటు మిగిలిన పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">