ETV Bharat / sitara

జాన్వీ సినిమాకు మరోసారి సాగు చట్టాల సెగ! - గుడ్​లక్​ జెర్రీ షూటింగ్​కు బ్రేక్​

స్టార్​ హీరోయిన్ జాన్వీ కపూర్​ ప్రధానపాత్రలో నటిస్తున్న 'గుడ్​లక్​ జెర్రీ' సినిమా షూటింగ్​కు మరోసారి అంతరాయం కలిగింది. పటియాలాలో షూటింగ్​ జరుపుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణ వద్ద కొంతమంది సాగు చట్టాల వ్యతిరేకులు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో మరోసారి షూటింగ్​కు బ్రేక్​ పడింది.

Janhvi Kapoor's Good Luck Jerry shoot halted in Punjab due to farmers' protest
జాన్వీ సినిమాకు మరోసారి సాగు చట్టాల సెగ!
author img

By

Published : Jan 24, 2021, 11:40 AM IST

Updated : Jan 24, 2021, 11:46 AM IST

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ నటిస్తోన్న 'గుడ్​లక్​ జెర్రీ' సినిమాకు మరోసారి రైతుల నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం పంజాబ్​లోని పటియాలాలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడికి చేరుకున్న కొంతమంది రైతులు ఆందోళన చేపట్టడం వల్ల మరోసారి షూటింగ్​ నిలిచిపోయింది.

కొన్ని వార్తాసంస్థల నివేదిక ప్రకారం.. సాగు చట్టాల విషయంలో కోపోద్రిక్తులైన కొంతమంది రైతులు పటియాలాలోని 'గుడ్​లక్​ జెర్రీ' షూటింగ్​ ప్రదేశానికి చేరుకుని.. 'జాన్వీ కపూర్​ వాపస్​ జావో' (జాన్వీ కపూర్​ వెనక్కి వెళ్లిపో) అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ముందు జాగ్రత్తగా చిత్రబృందం షూటింగ్​ను నిలిపేసింది. దీంతో నటీనటులంతా తాము బసచేస్తోన్న హోటల్స్​కు వెళ్లిపోయారు. నిరసనకారులు అక్కడికి వెళ్లి మరి ఆందోళన చేసినట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఆందోళన..

ఇదే విధంగా జనవరి 11న కూడా ఈ సినిమా షూటింగ్​కు కొంతమంది రైతులు అంతరాయం కలిగించారు. చిత్రీకరణను విడిచి జాన్వీ తిరిగి వెళ్లిపోవాలని ఆందోళనకారులు డిమాండ్​ చేశారు.

'గుడ్​లక్​ జెర్రీ' చిత్రంలో జాన్వీ కపూర్​తో పాటు దీపక్​ దోబ్రియేల్​, మీటా వశిష్ఠ్​, నీరజ్​ సూద్​, సుశాంత్ సింగ్​ కీలకపాత్రలో పోషిస్తున్నారు. పంకజ్​ మట్టా కథను అందించగా.. సిద్ధార్థ్​ సెన్​గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ది నైట్​ మేనేజర్​'తో హృతిక్ ఓటీటీ​ ఎంట్రీ!

Last Updated : Jan 24, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.