ETV Bharat / sitara

ఆ విషయంలో అసలు వెనుకాడను: జాన్వీ - జాన్వీ సారా అనన్య

యువ కథానాయికలు సారా అలీఖాన్, అనన్యా పాండే, జాన్వీ కపూర్ మధ్య చిత్రపరిశ్రమలో పోటీ ఉంటుందని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన జాన్వీ.. అలాంటి ఊహాగానాలను తాను పట్టించుకోనని చెప్పింది. వారి ముగ్గురి మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

janhvi kapoor thinks about her competition with her peers sara and ananya
ఆ విషయంలో అసలు వెనుకాడను: జాన్వీ
author img

By

Published : Feb 26, 2021, 8:56 AM IST

చిత్రపరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు అడుగు పెడుతుంటారు. కొందరు త్వరగానే గుర్తింపు సాధిస్తారు. శ్రీదేవి తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతోంది. గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలవైపు అడుగులేస్తోందీ భామ. ఈమెతో పాటు యువతరం నాయికల్లో సారా అలీఖాన్, అనన్యా ఉండే కూడా ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ల గురించే ఎందుకంటే జాన్వీకపూర్​కు వీళ్లిద్దరే పోటీ అని బాలీవుడ్లో అనుకుంటున్నారట. ఇదే విషయమై ఓ ఇంటర్య్వూలో జాన్వీ స్పందించారు.

"మా మధ్య ఉండేది ఆరోగ్యకరమైన పోటీయే కానీ కొందరు దాన్ని చూడటంలోనే తేడా ఉంది. చిత్ర పరిశ్రమలో పదిమంది హీరోయిన్లు ఉంటే మా ముగ్గురి మధ్య పోటీ ఉందని అనడం ఏంటి? నేను ఆయితే ఇవన్నీ పట్టించుకోను. నా తోటి నాయికల సినిమాలు బాగుంటే వాళ్లను అభినం దించడానికి నేను అస్సలు వెనుకాడను."

- జాన్వీ కపూర్​, బాలీవుడ్​ కథానాయిక

జాన్వీ నటించిన హారర్ చిత్రం 'రూప్' మార్చి 11న విడుదల కానుంది. "నాలో నటిని బయటకు తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేసే పాత్రల్ని 'రూప్'లో పోషించాను. నాకు ఎంత సవాల్‌గా అనిపించాయో అంత కంటే ఎక్కువగా ఎంజాయ్ చేశాను" అంటోంది జాన్వీ, ఆమె ప్రస్తుతం దోస్తానా ', 'గుడ్ లబ్ జెర్రీ' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: హృతిక్ రోషన్​​కు ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.