చిత్రసీమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు నటులు వైరస్ బారిన పడగా.. తాజాగా తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్కు కూడా కొవిడ్ సోకినట్లు తెలిపింది బీటౌన్ హీరోయిన్ జాన్వీకపూర్. ఈ విషయాన్ని జాన్వీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. జనవరి 3నే తామిద్దరికీ కరోనా సోకిందని, అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నట్లు జాన్వీ పేర్కొంది. తాజా పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు చెప్పింది.
"జనవరి 3న మాకు కరోనా సోకింది. అప్పటినుంచి ఐసోలేషన్‌లో ఉన్నాం. తాజా పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది. మొదటి రెండు రోజులు బాగా ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత మా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్, మాస్క్ తప్పనిసరి. అందరూ జాగ్రత్తగా ఉండండి."
-జాన్వీ కపూర్, హీరోయిన్.
కాగా, జాన్వీ.. 'దోస్తానా 2', 'గుడ్ లక్ జెర్రీ', 'మిలి' చిత్రాల్లో నటిస్తోంది.
కట్టప్ప డిశ్ఛార్జ్
ఇటీవలే కరోనా బారిన పడి ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్ నటుడు సత్యరాజ్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తెలిపారు. సత్యరాజ్ కోలుకున్నారని, ఇంటికి తిరిగి వచ్చేశారని పేర్కొన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తిరిగి మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటారని వెల్లడించారు.
ఇదీ చూడండి: రేణు దేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్