అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేహా దూపియా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న 'నో ఫిల్టర్ నేహా' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఈ నటి.. పలు విషయాలను వెల్లడించింది.
ఆల్ టైమ్ ఫేవరెట్ విజయ్
"విజయ్ నా ఆల్టైమ్ క్రష్. అతడి గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పా. కానీ విజయ్ నుంచి మాత్రం స్పందన రావట్లేదు (నవ్వుతూ)." అంటూ చెప్పుకొచ్చింది జాహ్నవి.
ఇషాన్ మనసు మంచిది
'ధడక్' కో స్టార్ ఇషాన్ ఖట్టర్ మనసు చాలా మంచిదని చెప్పింది జాహ్నవి. అతడి కళ్లు అందంగా ఉంటాయంది. ఇషాన్ది నిర్మలమైన, స్వచ్ఛమైన హృదయమంటూ పొగడ్తలతో ముంచెత్తింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. హీరోయిన్గా జాహ్నవిని ఎంపికచేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. జాహ్నవి మాటలు చూస్తుంటే తనకు దేవరకొండతో నటించాలని ఉందని తెలుస్తోంది.