ETV Bharat / bharat

స్టాక్స్​లో డబుల్​ ప్రాఫిట్ అంటే నమ్మేసిన మహిళ - ఏకంగా రూ.10.45 కోట్లు లాస్ - STOCK MARKET FRAUD

డివిడెండ్​ల పేరిట భారీ మోసం - రూ.10.45 కోట్లు నష్టపోయిన కర్ణాటకకు చెందిన మహిళ

Stock market fraud
Stock market fraud (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 7:38 PM IST

Stock Market Fraud : స్టాక్ మార్కెట్ మోసానికి బలై ఓ మహిళ రూ.10.45 కోట్లు నష్టపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో జరిగింది. అధిక మొత్తం డివిడెండ్ వస్తుందనే ఆశతో విజయలక్ష్మి అనే మహిళ స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేశారు. కానీ తాను ఇన్వెస్ట్ చేసినది నకిలీ కంపెనీలో అని, తాను మోసపోయానని తేలిన నేపథ్యంలో ఆమె సీఈఎన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

"నేను వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మొత్తంగా రూ.10,45,50,000ను ఆన్​లైన్లో ఒక షేర్​ కంపెనీలో దశలవారీగా పెట్టుబడి పెట్టాను. దానిపై భారీగా డివిడెండ్ కూడా వచ్చింది. కానీ నేను ఆ డబ్బును విత్​డ్రా చేయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. దీనితో నేను మోసపోయానని తెలుసుకున్నాను. అందుకే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాను" అని బాధిత మహిళ పేర్కొన్నారు.

వాస్తవానికి విజయలక్ష్మి రూ.10.45 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆమె స్టాక్ మార్కెట్ ఖాతాలో డివిడెండ్, లాభాలతో కలిపి రూ.23 కోట్లుగా చూపుతోంది. దీనితో ఆమె ఆ డబ్బులు విత్​డ్రా చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు సదరు కంపెనీ ఖాతాలోని సగం డబ్బును తీసుకోమని చెప్పింది. అక్కడితో ఆగకుండా ఆ కంపెనీలో మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది. కానీ డబ్బు విత్​డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. దీనితో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించింది.

కేసు సీఐడీకి బదిలీ
'ఈ స్టాక్ మార్కెట్​ మోసం గురించి విజయలక్ష్మి దావణగెరె సీఈఎన్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే కేవలం రూ.3 కోట్ల లోపు ఉండే కేసులను మాత్రమే మేము టేకప్ చేస్తాం. అంతకు మించిన విలువ ఉంటే, సదరు కేసులను సీఐడీ అప్పగిస్తాం. బాధితురాలు రూ.10.45 కోట్లు నష్టపోయారు కాబట్టి ఇకపై ఆ కేసును సీఐడీ విచారిస్తుంది' అని దావణగెరె డీఎస్​పీ పద్మశ్రీ గుంజికర్ తెలిపారు.

ఆన్​లైన్​ ఫ్రాడ్స్​తో జరజాగ్రత్త!
ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చాక ఆన్​లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్​లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్​మెంట్​ ఫ్రాడ్​లు బాగా పెరిగిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆన్​లైన్​లో అనధికారిక వ్యక్తులు ఇచ్చే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.