ETV Bharat / sitara

బుల్లితెరపై సందడికి జగపతిబాబు సిద్ధం! - జగపతి బాబు మూవీ అప్​డేట్స్

టాలీవుడ్​లో హీరోగా పరిచయమై.. విలక్షణ పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు జగపతి బాబు. తాజాగా బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతడు వ్యాఖ్యాతగా రాబోతున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

Jagapathi Babu as host in a TV Show
బుల్లితెరపై సందడి చేయనున్న జగపతిబాబు!
author img

By

Published : Mar 9, 2020, 10:42 PM IST

టాలీవుడ్​ ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని.. ఇప్పటికే బుల్లితెరపై సందడి చేశారు. ఇప్పుడీ జాబితాలోకి జగపతి బాబు చేరబోతున్నాడని సమాచారం. ఓ ప్రముఖ ఛానల్‌ నిర్వహించనున్న కార్యక్రమానికి జగ్గూభాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే జగపతితో చర్చలు సాగాయని, అతడు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయని టాక్‌. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

సహజ నటనతో అటు హీరోగా, ఇటు విలన్‌గా వెండితెరపై తనదైన ముద్ర వేశాడు జగపతిబాబు. ఇప్పుడు బుల్లితెరపై ఎలా అలరిస్తాడో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేశ్​ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న 'మిస్‌ ఇండియా' చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ కనువిందు చేయనున్నాడు.

ఇదీ చూడండి.. 'ఊపిరి మొత్తం ఉప్పెన అయితే ధక్ ధక్ ధక్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.