దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా గడుపుతోంది ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పటికీ హిందీ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ... తాజాగా జాన్ అబ్రహం హీరోగా వస్తున్న 'ఎటాక్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనుంది. యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కుతున్న సినిమాలో... రకుల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఇందులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధానపాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం జాన్ అబ్రహం ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట.
ఈ ఏడాది వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తోంది రకుల్. ఇటీవల అజయ్ దేవగణ్, టబులతో కలిసి 'దే దే ప్యార్ దే'లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన 'మర్ జావా' చిత్రంలోనూ సందడి చేసింది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడుగా వస్తున్న 'భారతీయుడు-2'లోనూ రకుల్ నటిస్తోంది. అంతేకాకుండా శివకార్తికేయన్‌తో తమిళంలో ఓ సినిమా, అర్జున్‌కపూర్, కాశ్వీ నాయర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్‌తో కలిసి మరో హిందీ సినిమాలోనూ నటిస్తోందీ పొడుగు సుందరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">