పంచ్‌లు విసురుతూ, తనదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా కనిపిస్తూ సినీప్రియుల్ని అలరిస్తున్నాడు. తాజాగా అతడి మంచి మనసు గురించి బయటపెట్టాడు మరో జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు(Hyper adi character). కరోనా సమయంలో తనను ఆరు నెలల పాటు ఆదుకున్నాడని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవలే ప్రసారమైన 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'లో ఈ విషయాన్ని తెలిపాడు(Sridevei drama company latest episode).
హైపర్ ఆది టీమ్‌లో సభ్యుడిగా ఉంటాడు రైజింగ్ రాజు. అయితే ఈయన కొద్ది కాలం క్రితం ఆరు నెలల పాటు జబర్దస్త్‌లో కనిపించలేదు. దీంతో అందరికీ పలు అనుమానాలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందిస్తూనే ఆది మంచి మనసు గురించి బయటపెట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"కరోనా సెకండ్ వేవ్‌లో నాకు మనవరాలు పుట్టింది. ఆ సమయంలో బయటకు వెళ్తే పాపకు ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడి ఇంట్లోనే ఉన్నా. ఈ విషయాన్ని ఆదితో చెప్పా. స్కిట్లు చేయకపోతే డబ్బులు రావు. ఇంట్లో మనవరాలు పుట్టినందున ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని నేను పనిచేయకపోయినా ఆరు నెలల పాటు డబ్బులు పంపించిన మహానుభావుడు ఆది. నన్ను ఆదుకున్నాడు." అంటూ రైజింగ్ రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదీ చూడండి: 'పుష్ప' ట్రైలర్ రిలీజ్ డేట్.. 'స్పైడర్‌మ్యాన్' ఒకరోజు ముందే