అసలే చేసేది మూడు రోజుల పండుగ. మరి జాతర ఎంత భారీ స్థాయిలో జరగాలి. ఆ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత తీసుకురావాలి. అందుకే అందమైన భామను దింపి, పతంగుల పండుగలో హుషారు నింపుతున్నాడు మంచోడు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచి వాడవురా'. ఇందులోని 'జాతరో జాతర' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. 'బిగ్‌బాస్ 3' విజేత రాహుల్ సింప్లిగంజ్ పాడటం విశేషం.
సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరిచిన ఈ గీతం.. సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటతో పాటు అందులోని నృత్యం అలరిస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకుడు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మంచోడు'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">