మార్వెల్ స్టూడియో, సోనీ సంస్థల మధ్య సినిమా హక్కుల పంపకం ఒప్పందం కుదరలేదు. ఈ షాకింగ్ నిర్ణయంతో తన భవిష్యత్తు సందిగ్ధంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్.
డిస్నీ పిక్చర్స్ ప్యానెల్ ఆధ్వర్యంలోని డీ23 ఎక్స్‌పోలో వస్తోన్న 'ఆన్వర్డ్' సినిమా ప్రచారానికి హాజరైన టామ్... ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు.
"మార్వెల్-సోనీ విడిపోవడం వల్ల ఈ వారం కాస్త గందరగోళం ఏర్పడింది. కానీ కష్టసమయంలో వెంట నిలిచిన అభిమానులకు నేను బుణపడి ఉంటాను. మీ అందరినీ అమితంగా ప్రేమిస్తున్నా"
-టామ్ హోలాండ్, స్పైడర్ మ్యాన్‌లో సూపర్ హీరో
ఆగస్టు 20న మార్వెల్-సోనీ సంస్థల సినిమా హక్కులు పంచుకొనే ఒప్పందం ముగిసింది. ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించిన కివీన్ ఫైజీతో సంబంధం ముగిసిందని తెలిపాయి స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ ఫ్రాంచైజీ.
'స్పైడర్ మ్యాన్ హోమ్‌కమింగ్','స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్'ను నిర్మించాడు ఫైజీ. ఈ రెండు చిత్రాలు సోనీ సంస్థకు భారీ వసూళ్లను తెచ్చిపెట్టాయి.
ఇది చదవండి: భామ కొంటె చూపు.. కుర్రాళ్ల మైమరపు