ETV Bharat / sitara

హీరో సుశాంత్ మృతిపై ఇజ్రాయెల్ అధికారి ట్వీట్ - సుశాంత్ సింగ్ తాజా వార్తలు

సుశాంత్ సింగ్ లాంటి నిజమైన స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని ఇజ్రాయెల్ అధికారి గిలాడ్ కోహెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

హీరో సుశాంత్ మృతిపై ఇజ్రాయెల్ అధికారి ట్వీట్
హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్
author img

By

Published : Jun 17, 2020, 5:46 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మృతిపై సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ సంతాపం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం.. ఈ యువ నటుడి మరణంపై విచారం వ్యక్తం చేసింది. నిజమైన స్నేహితుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల డిప్యూటీ డైరక్టర్ జనరల్ గిలాడ్ కోహెన్ ట్వీట్ చేశారు.

"సుశాంత్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అతడు ఇజ్రాయెల్​కు నిజమైన స్నేహితుడు. నిన్ను చాలా మిస్సవుతున్నాం" అని గిలాడ్ రాసుకొచ్చారు. దీనితో పాటే సుశాంత్ నటించిన 'డ్రైవ్' సినిమాలోని 'మఖనా' పాటను షేర్ చేశారు. ఈ గీతం మొత్తాన్ని ఇజ్రాయెల్​లోనే చిత్రీకరించారు. ఇందులో సుశాంత్​తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్​, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.