ETV Bharat / sitara

అల్లు అర్జున్‌కి తొమ్మిది మంది విలన్లా..? - అల్లు అర్జున్​ తాజా వార్తలు

సినిమాకి విలన్‌ దొరకడం అంత సులభమా? దర్శకుల్ని ఈ మాట అడిగితే కష్టమే అంటారు. హీరోయిన్‌ కోసం ఎంతగా వెతుకుతున్నారో, విలన్‌ కోసమూ అంతే వెతుకుతున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఓ సినిమాలో తొమ్మిది మంది విలన్లు అంటే నమ్ముతారా? టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ చూస్తే నమ్మకతప్పదు అనిపిస్తోంది.

is there 9 villains in allu arjun new movie pushpa
అల్లు అర్జున్‌కి తొమ్మిది మంది విలన్లా?
author img

By

Published : Nov 26, 2020, 8:35 PM IST

'పుష్ప'లో హీరో తెలుసు, హీరోయిన్‌ తెలుసు.. విలన్‌ సంగతే తెలియదు. ఈ పాత్ర కోసం బాబీ సింహా, విజయ్‌ సేతుపతి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు విలన్ల సంఖ్య మీద కూడా కొత్త మాట చక్కర్లు కొడుతోంది. 'పుష్ప'రాజ్‌ను ఢీకొట్టడానికి కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. 'డిస్కోరాజా', 'కలర్‌ఫొటో'తో తనలోని విలనిజం చూపించిన సునీల్‌ 'పుష్ప'కి విలన్‌ అవుతాడని అంటున్నారు. మరోవైపు 'చియాన్‌' విక్రమ్‌ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

is there 9 villains in allu arjun new movie pushpa
పుష్ప సినిమాలో అల్లు అర్జున్​

అయితే.. ఈ సినిమాలో ఇప్పుడు తొమ్మిది మంది విలన్లు ఉంటారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో అయితే హాట్ టాపిక్‌గా మారింది. పాత కాలం సినిమాల్లోలాగా 'పుష్ప'లో ఎక్కువమంది విలన్లను సుకుమార్‌ పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బేసిక్‌ వర్క్‌ కూడా పూర్తయిందట. ఈ మాట కూడా పుకారులా మిగిలిపోతుందా.. లేక నిజమవుతుందా అనేది చూడాలి. బన్ని-సుకుమార్ కాంబో‌ కదా ఏదైనా సాధ్యమే మరి!

ఇదీ చూడండి:'పుష్ప'లో బన్నీ-విక్రమ్​ క్రేజీ కాంబో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.