ETV Bharat / sitara

స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి కష్టమేనా?

ఈసారి సంక్రాంతికి మహేశ్​, ప్రభాస్​, పవన్ కల్యాణ్​..​ బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో బరిలో దిగనున్నారు.​అయితే ఈ మూడు సినిమాల ఒకేసారి విడుదల కావడం వల్ల థియేటర్ల కొరతతో పాటు చిత్రసీమకు నష్టం చేకూరే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా! అందుకే పవన్​ అనుకున్న దాని కంటే ముందే థియేటర్లలోకి రానున్నారని సమాచారం. ఓవర్సీస్​తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్లు తెరుచుకోకపోవడమూ ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

author img

By

Published : Aug 19, 2021, 9:23 AM IST

Is the releases of Tollywood movies likely to be delayed again?
టాలీవుడ్​లో మరోసారి వాయిదాల పర్వం తప్పదా?

అగ్ర కథానాయకుల్లో చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్‌'తోపాటు పవన్‌కల్యాణ్‌ 'భీమ్లా నాయక్​'.. ఈ మూడూ ముగ్గుల పండక్కి బెర్తులు ఖాయం చేశాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Is the releases of Tollywood movies likely to be delayed again?
భీమ్లా నాయక్​

రాధేశ్యామ్​

రెండో దశ కరోనా మొదలు కాకముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్‌కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు', మరొకటి 'సర్కారు వారి పాట'. కరోనా తర్వాత కొత్త చిత్రాలు తెరపైకొచ్చాయి. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' స్థానంలో, పవన్‌కల్యాణ్‌-రానా మల్టీస్టారర్​ చిత్రం జనవరి 12న రానున్నట్లు ప్రకటించారు. మరోవైపు మహేశ్​ 'సర్కారు వారి పాట' ముందే చెప్పినట్టు పండగ కోసమే ముస్తాబవుతుండగా, 'రాధేశ్యామ్‌' అనూహ్యంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేశారు. దాంతో సంక్రాంతి బరి మరింత రసవత్తరంగా మారింది.

సర్కారు వారి పాట

'పుష్ప'రాజ్​తో పోటీ..

సంక్రాంతి ఒకేసారి ముగ్గురు అగ్రకథానాయకులు బాక్సాఫీస్​ వద్ద పోటీపడడం మంచిది కాదని సినీ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల విడుదలలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 'భీమ్లా నాయక్​'గా పవన్​ కల్యాణ్​.. సంక్రాంతి కంటే ముందే వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్​లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిస్​మస్​కు ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగే పవన్, అల్లు అర్జున్ 'పుష్ప'తో పోటీ పడక తప్పదు.

ఆర్ఆర్ఆర్

పాన్​ ఇండియా చిత్రాలూ డౌటే!

మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రంగా థియేటర్లు తెరచుకోగా.. ఓవర్సీస్​తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సినిమాహాళ్లు పూర్తిగా తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో పాన్​ ఇండియా చిత్రాలైన 'ఆర్​ఆర్​ఆర్​', 'రాధేశ్యామ్​' రిలీజ్​పై సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ అక్టోబరు 13 నాటికి థియేటర్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోతే పాన్​ ఇండియా చిత్రాల విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉంది.

ఆచార్య

అఖండ

వాయిదా తప్పదా?

టాలీవుడ్​ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలూ దసరా బరిలో ఉండాలని సన్నాహాలు చేస్తున్నాయి. చిరు 'ఆచార్య', బాలయ్య 'అఖండ' సినిమాలూ.. టాలీవుడ్​తో పాటు ఓవర్సీస్​ మార్కెట్​పైనా ఆధారపడ్డాయి. ఒకవేళ ఆ సమయంలో అక్కడ సినిమాహాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే ఈ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి!

ఇదీ చూడండి.. '105 మినిట్స్​'లో హన్సిక ఏకపాత్రాభినయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.