ETV Bharat / sitara

విక్రమ్ వేద: అప్పుడేమో ఆమిర్​.. ఇప్పుడేమో సైఫ్!​ - సైఫ్​ అలీఖాన్​ విక్రమ్​ వేదా

'విక్రమ్​ వేద' హిందీ రీమేక్​ నుంచి ఇటీవల ఆమిర్​ ఖాన్​ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సైఫ్​ అలీ ఖాన్​ కూడా డేట్స్​ కుదరక ఈ చిత్రం నుంచి వైదొలిగినట్లు తెలిసింది.

saif
సైఫ్​
author img

By

Published : Mar 28, 2021, 5:31 AM IST

బాలీవుడ్ సూపర్​స్టార్​ ఆమిర్ ఖాన్, సైఫ్​ అలీఖాన్ ప్రధానపాత్రల్లో తమిళ హిట్​ చిత్రం 'విక్రమ్​ వేద' హిందీ రీమేక్​ చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఇటీవల ఆమిర్​ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సదరు పాత్ర కోసం హృతిక్​రోషన్​ను చిత్రబృందం సంప్రదించారని తెలిసింది. ఇప్పుడు సైఫ్​ అలీఖాన్​ కూడా వైదొలిగినట్లు సమాచారం. డేట్స్​ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆయన తప్పుకున్నారని వినికిడి.

రాజా విక్రమాదిత్య కాలానికి చెందిన జానపద కథ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద'. పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించారు. వీరిద్దరే హిందీ సినిమాను తెరకెక్కించనున్నారు. బేతాళ కథలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీయనున్నారు. కథ మెుత్తం విక్రమ్ అనే పోలీసు, వేద అనే నేరస్థుడి చుట్టూ తిరుగుతుంది. తమిళంలో పోలీసుగా మాధవన్ నటించగా.. నేరస్థుడిగా విజయ్ సేతుపతి కనిపించారు.

ఇదీ చూడండి: సేతుపతితో విభేదాలు.. 'విక్రమ్ వేద'కు ఆమిర్ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.