డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన అతడు.. రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం.
ఒక్క సినిమాకు రూ.100 కోట్లు?
మన దేశంలో ఓ సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని, అందుకు న్యాయం చేయగల ఒకే ఒక్క నటుడు ప్రభాస్ అని, తన సినిమాల ద్వారా నిర్మాతలకు చాలా డబ్బులు తీసుకొచ్చే సత్తా అతడికి ఉందని ప్రభాస్ సన్నిహితుల్లో ఒకరు చెప్పారు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'రాధేశ్యామ్'.. ఈ ఏడాది జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్‌తో సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో 'ఆదిపురుష్' చేస్తున్న డార్లింగ్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నారు.