పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు అవకాశం ఉందని... ప్రధాన నాయికగా కాజల్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాజల్ ఈ పాత్రకు సరిపోతుందని, అందుకే ఆమెకు కథ వినిపించారని టాక్. కాజల్ పచ్చ జెండా ఊపే అవకాశాలున్నాయని వినికిడి. అధికారిక ప్రకటన రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇంతకముందు వీరిద్దరు 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాతో సందడి చేశారు. మరో నాయిక వివరాలు సైతం త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాతోపాటు మరో సినిమాలో నటిస్తున్నాడు పవన్. చిరంజీవి సరసన 'ఆచార్య'లో నటిస్తోంది కాజల్.
ఇదీ చూడండి : ఈ సెలబ్రిటీ భార్యభర్తలు అల్లరే అల్లరి