ETV Bharat / sitara

Tiger-Disha:టైగర్​ష్రాఫ్​తో దిశా డేటింగ్​.. జాకీష్రాఫ్ క్లారిటీ - disa patani latest news

టైగర్​ ష్రాఫ్​-దిశాపటానీ రిలేషన్​షిప్​లో(Tiger Shroff-Disha Patani dating) ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి ఇప్పుడు టైగర్​ తండ్రి జాకీ ష్రాఫ్(jackie shroff)​ కూడా మాట్లాడారు.​

Tiger Shroff dating Disha Patani
టైగర్​ ష్రాఫ్​-దిశాపటానీ డేటింగ్​
author img

By

Published : Jun 21, 2021, 10:33 AM IST

లవ్​బర్డ్స్​ టైగర్​ ష్రాఫ్​-దిశా పటానీ డేటింగ్​లో(Tiger Shroff-Disapatani dating) ఉన్నట్లు గత కొద్దీ కాలంగా బాలీవుడ్​లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖాళీ దొరికితే ఎప్పుడు కలిసి ఉండే ఈ జంట ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారికంగా ఏం మాట్లాడలేదు. జూన్​ 20న ఫాదర్స్​ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైగర్​ తండ్రి, సీనియర్​ నటుడు జాకీ ష్రాఫ్​ ఈ విషయమై స్పందించారు. వారిద్దరూ మంచి స్నేహితులని అన్నారు.

"అది అతడి జీవితం. 25ఏళ్ల వయసులోనే డేటింగ్​ చేయడం ప్రారంభించాడు. నాకు తెలిసి వీరిద్దరూ మంచి స్నేహితులు. భవిష్యత్తులో మరి వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు. అయినా టైగర్​కు అన్నింటికన్నా పని మీద దృష్టి ఎక్కువ. నాకు తెలిసినంతవరకు పనే అతడి మొదటి ప్రేయసి." అని జాకీ చెప్పారు.

తన కుమారుడు టైగర్ డేటింగ్​ చేసినట్లు చెప్పిన జాకీ.. ​దిశాతో డేటింగ్​లో ఉన్నాడా లేదా అనే విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలోనూ టైగర్-దిశా రిలేషన్​ గురించి మాట్లాడిన జాకీ ష్రాఫ్​.. భవిష్యత్​లో వారు పెళ్లి చేసుకోవచ్చు. లేదా జీవిత కాలం స్నేహితులుగా ఉండిపోవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం 'హీరోపంతి 2', 'బాఘీ 4' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు టైగర్​. అతడు హీరోగా 'ఇండియన్ రాంబో' చిత్రాన్ని మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు అది ప్రారంభం కాలేదు. ఇటీవల సల్మాన్​ ఖాన్​ 'రాధే'తో(SalmanKhan-Radhe) ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా.. ప్రస్తుతం 'ఓకే టీనా', 'ఏక్​ విలన్​ రిటర్న్స్​' సినిమాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.