ETV Bharat / sitara

Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్​, భూమి! - భూమి పెడ్నేకర్​

అక్షయ్​ కుమార్(Akshay Kumar)​, భూమి పెడ్నేకర్​ మరోసారి జోడీ కట్టనున్నారు. ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వంలో రూపొందనున్న 'రక్షాబంధన్​'(Raksha bandhan) చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారని సమాచారం. ఈ నెలలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Is Bhumi Pednekar part of Akshay Kumar's 'Rakshabandhan'?
Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్​, భూమి!
author img

By

Published : Jun 8, 2021, 8:16 AM IST

'టాయ్​లెట్​: ఏక్ ప్రేమ్ కథ' చిత్రంలో భార్యాభర్తలుగా నటించి ఆకట్టుకున్నారు అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్(Bhumi Pednekar). ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరో చిత్రంలో నటించడానికి రంగం సిద్ధమైంది. ఆనంద్ ఎల్ రాయ్(Aanand L Rai) దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం 'రక్షాబంధన్'(Raksha bandhan). ఇందులో అక్షయ్(Akshay Kumar), భూమి నటించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని ఇదే ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటివరకూ ప్రాజెక్టు సెట్స్​పైకే వెళ్లలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెలలోనే 'రక్షాబంధన్' చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది.

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్ నటించిన 'అత్రాంగి రే'(Atrangi Re) ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. భూమి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దుర్గామతి'(Durgamati) సినిమాను అక్షయ్ నిర్మించారు.

ఇదీ చూడండి: బెల్​ బాటమ్, సూర్యవంశీ ఓటీటీలోనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.