క్యాన్సర్‌తో పోరాడుతూ నేడు తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ముంబయిలోని వెర్సోవా కబ్రిస్థాన్లో అతడి పార్థివదేహాన్ని ఖననం చేశారు. కుమారులు బాబిల్, అయాన్.. తండ్రి చివరి కార్యక్రమాలు చేశారు. కుటుంబ సభ్యులు మినహా బంధువులు, స్నేహితులు కలిపి ఐదురుగు మాత్రమే హాజరయ్యారు. వారంతా ఇర్ఫాన్‌కు నివాళి అర్పించారు.
ఆరోగ్యం క్షీణించడం వల్ల నిన్న(మంగళవారం).. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన ఇర్ఫాన్.. ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. 2018 నుంచి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. గత శనివారమే ఇతడి తల్లి సయిదా మృతి చెందారు. ఇలా ఇర్ఫాన్ కుటుంబంలో వరుస మరణాలు సంభవించడం వల్ల వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.