ETV Bharat / sitara

'క్యాలీఫ్లవర్'.. నాకెంతో ప్రత్యేకం: హీరోయిన్ వాసంతి - క్యాలీఫ్లవర్​ మూవీ రిలీజ్ డేట్

'క్యాలీఫ్లవర్' సినిమాలో అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయని హీరోయిన్ వాసంతి చెప్పింది. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రంతో ఈమె హీరోయిన్​గా పరిచయమవుతోంది.

Interview of Vasanthi about Cauliflower movie
క్యాలీఫ్లవర్ మూవీ హీరోయిన్ వాసంతి
author img

By

Published : Nov 21, 2021, 7:20 AM IST

వినోదంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు పుష్కలంగా ఉన్న సినిమా మా 'క్యాలీఫ్లవర్‌' అని నటి వాసంతి చెబుతుంది. సంపూర్ణేశ్​బాబు హీరోగా నటించిన చిత్రమిది. ఆర్కే మలినేని తెరకెక్కించారు. ఆశా జ్యోతి గోగినేని నిర్మాత. ఈ సినిమాతోనే హీరోయిన్​గా తెలుగు తెరకు పరిచయమవుతోంది వాసంతి. ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా ఆమె శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

Cauliflower movie
క్యాలీఫ్లవర్ మూవీలో సంపూ

*నేను తెలుగమ్మాయినే. బెంగళూరులో పెరిగాను. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చాను. కన్నడలో ఇప్పటికే ఐదు చిత్రాలు చేశాను. తెలుగులో ఇదే తొలి సినిమా. నేనిందులో నీలవేణి అనే పాత్రలో కనిపిస్తాను. బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి తను. కథ వింటున్నప్పుడు ఈ పాత్ర నాకోసమే డిజైన్‌ చేసినట్లు అనిపించింది. సినిమా మొత్తం నేను లంగావోణిలోనే కనిపిస్తా. నాకెంతో ప్రత్యేకమైన చిత్రమిది.

* మొదట్లో ఈ చిత్రం చేయాలా? వద్దా? అని భయపడ్డా. అప్పటికి ఇందులో హీరో సంపూ అని తెలీదు. స్క్రిప్ట్‌ విభిన్నంగా ఉంది కదా అని ఒపుకొన్నా. కథలో క్యాలీఫ్లవర్‌ అని ఉంది. అదే టైటిల్‌ పెడతారని తెలీదు. సంపూకు సరిపోయే టైటిల్‌ ఇది. ఈ చిత్రంలో కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు చక్కటి సందేశమూ ఉంటుంది.

*ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అలాగే ఆది సాయికుమార్‌ చిత్రంలోనూ నటిస్తున్నా. నాకు నాని అంటే ఇష్టం. ఆయనతో సినిమా చేయాలనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.