ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్', 'ఆచార్య'​, 'భీమ్లా నాయక్​', 'సర్కారు వారి పాట' రిలీజ్​ డేట్స్​ - మహేశ్ బాబు

RRR Movie: 'ఆర్​ఆర్​ఆర్' కొత్త రిలీజ్​ డేట్​ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ముందుగా అనుకున్న రెండు తేదీలు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఆచార్య', పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్​' మేకర్స్​ కూడా కొత్త రిలీజ్​ డేట్​లను ప్రకటించారు.

ఆర్​ఆర్​ఆర్​ కొత్త రిలీజ్​ డేట్
author img

By

Published : Jan 31, 2022, 6:11 PM IST

Updated : Jan 31, 2022, 8:13 PM IST

RRR release date: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా విడుదలకు కొత్త తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం ముందుగా అనుకున్న మార్చి 18 లేదా ఏఫ్రిల్​ 28న కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్​లో వెల్లడించింది. మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్​ బర్త్​డే. అంతకు రెండు రోజుల ముందే సినిమా రిలీజ్​ అవతుండటం వల్ల చెర్రీ ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

'ఆచార్య' కూడా..

Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా కొత్త రిలీజ్ డేట్​ను సైతం ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. చర్చల అనంతరం పరస్పర అంగీకారంతో విడుదల తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు.

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది. రామ్​చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

'భీమ్లా నాయక్'​.. రెండు తేదీలతో

  • As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all.

    We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp

    — Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు పవన్‌కల్యాణ్‌-రానా కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్‌' కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 25న కానీ, పరిస్థితులు సహకరించిన పక్షంలో ఏప్రిల్‌ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్.

ఆరోజే 'సర్కారు వారి పాట'

sarkaru vaari paata release date
'సర్కారు వారి పాట'

Sarkaru Vaari Paata release date: సూపర్​స్టార్ మహేశ్​ బాబు నటించిన సర్కారు వారి పాట మే12న విడుదలకానుంది. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తిసురేశ్ కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.

'ఎఫ్​ 3' ఎప్పుడంటే..?

F3 Venkatesh Movie: వెంకటేశ్​, వరుణ్​తేజ్​ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎఫ్​ 3' విడుదల తేదీని ప్రకటించింది నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్​. ఏప్రిల్​ 28న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజు నిర్మాత.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

తెలుగు హీరోల ప్రాణమంతా 'పాన్ ఇండియా'

RRR censor review: 'మైండ్​ బ్లోయింగ్​.. ఎన్టీఆర్​ నటన టాక్​ ఆఫ్​ ది టౌన్​'

Madhavan: 'రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ను చూస్తే అసూయ కలుగుతోంది'

Last Updated : Jan 31, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.