ETV Bharat / sitara

లండన్​ ఇంట్లో బాలీవుడ్ సెలబ్రిటీస్​! - Ajay Devgan London house

బాలీవుడ్​కు చెందిన పలువురు తారలకు లండన్​లోనూ సొంత గృహాలు ఉన్నాయి. షారుక్​తో పాటు పలువురు అక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. వారెవరో చూద్దాం.

celebrities in London
లండన్​లో ఇళ్లు.. ఈ నటులకే చెల్లు!
author img

By

Published : May 11, 2021, 6:17 PM IST

బాలీవుడ్ నటులు తెరపై ఎలా పోటీపడతారో కానీ తెర వెనక మాత్రం అందరూ ఐకమత్యంతో ఉంటారు. అలాగే ఆస్తుల విషయంలోనూ వీరి మధ్య పోటీ హుందాగానే ఉంటుంది. ముంబయిలో ఇళ్లు, స్థలాలతో పాటు విదేశాల్లోనూ కొందరు ప్రాపర్టీని కొనుగోలు చేశారు. షారుక్ ఖాన్, శిల్పాశెట్టి, సోనమ్ కపూర్, కాజోల్​లకు లండన్​లో గృహాలు ఉన్నాయి. ఇందులో షారుక్, కాజోల్ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ నేపథ్యంలో లండన్​లో ఇల్లు కొనుగోలు చేసిన స్టార్ నటులు ఎవరో తెలుసుకుందాం.

షారుక్ ఖాన్

విదేశాల్లో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​కు చాలా ఆస్తులే ఉన్నాయి. దుబాయ్​, యూకేలాంటి నగరాల్లో ప్రాపర్టీని కొనుగోలు చేశారు షారుక్. లండన్​లోని పార్క్​ లేన్​లో ఆయనకు ఇల్లు ఉంది. దీని గురించి ఎక్కువ విషయాలు తెలియకపోయినా.. షారుక్ తనయుడు ఆర్యన్, కూతురు సుహానా ఖాన్​ ఇక్కడి నుంచి పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు సమాచారం.

సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా

లండన్​లోని నాటింగ్ హిల్ ఏరియాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాలకు అపార్ట్​మెంట్ ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ అక్కడే గడుపుతున్నారు. వీరి ఇంటికి సంబంధించిన చాలా పోస్టులు, వీడియోలను సోనమ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

sonam kapoor house
సోనమ్ కపూర్ ఇల్లు

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా

బాలీవుడ్​ బ్యూటీ, ఫిట్​నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి దంపతులకు లండన్​లో విలాసవంతమైన ఇల్లు ఉంది. సర్రేలోని వేబ్రిడ్జ్​లో ఉన్న ఈ ఇంటిని రాజ్ మహల్​గా పిలుస్తారు. ఈ ఏరియాలోనే ప్రముఖ సెలబ్రిటీస్ క్లిఫ్ రిచర్డ్, ఎల్టాన్ జాన్ వంటి వారు ఉంటున్నారు. దీనితో పాటు లండన్​లో జన్మించిన రాజ్​ కుంద్రా శిల్పా కోసం 7 కోట్లతో సెంట్రల్ లండన్​లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

shilpashetty house
శిల్పాశెట్టి ఇల్లు

కాజోల్, అజయ్ దేవ్​గణ్

లండన్​లోని ప్రముఖ ప్రాంతంలో రూ.54 కోట్లతో బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవ్​గణ్, కాజోల్ జోడీ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లండన్ పార్క్​ లేన్​లోని​ షారుక్​ ఇంటి పక్కనే ఈ ప్రాపర్టీ ఉంటుందట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.