ETV Bharat / sitara

'అబ్బాయిల్ని తల్లిదండ్రులు బాధ్యతతో పెంచాలి'

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ట్వీట్ చేసింది. మగశిశువు జన్మిస్తే దాన్ని గొప్పగా, విశేషంగా భావించొద్దని తల్లిదండ్రులకు సూచించింది.

In our society having a male child is viewed as a privilege posted Anushka Sharma
'అబ్బాయిల్ని తల్లిదండ్రులు బాధ్యతతో పెంచాలి'
author img

By

Published : Oct 3, 2020, 9:00 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ సమాజం తీరును ఉద్దేశిస్తూ పోస్ట్‌ చేసింది. మగ శిశువు జన్మిస్తే దాన్ని గొప్పగా, విశేషంగా భావిస్తుంటారని.. అది సరికాదని సూచించింది.

"మగశిశువు పుడితే, దాన్ని ప్రత్యేక గుర్తింపుగా భావిస్తుంటారు. వాస్తవానికి, ఆడశిశువు పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదు. మగబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు దూరదృష్టితో ఆలోచించాలి. అమ్మాయిల్ని గౌరవించే విధంగా ఓ అబ్బాయిని పెంచినప్పుడు దాన్ని గొప్పగా భావించాలి. సమాజ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. కాబట్టి వారి పుట్టుకే.. ఓ విశేషంలా భావించొద్దు. శిశువు లింగం మిమ్మల్ని గొప్ప వారిని చేయదు. సమాజంలో జీవించడాన్ని మహిళలు సురక్షితంగా, క్షేమంగా భావించాలి.. ఆ విధంగా కుమారుల్ని పెంచడం మీ బాధ్యత."

-అనుష్క శర్మ, నటి

హాథ్రస్ అత్యాచార ఘటనను మరువక ముందే మృగాళ్ల పైశాచికత్వానికి మరో యువతి బలైంది. హాథ్రస్‌కు 500 కి.మీ దూరంలో ఉన్న బలరాంపుర్‌లోని గైసరి గ్రామానికి చెందిన 22 ఏళ్ల దళిత యువతిని కామాంధులు కిడ్నాప్ చేశారు. అత్యాచారానికి పాల్పడి, చిత్ర హింసలు పెట్టారు. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మరణించింది. దీనిపై కూడా అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో దారుణమైన ఘటన గురించి వినాల్సి వచ్చిందని, అమ్మాయిల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా? అని అసహనం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.