తెలుగులో విజయవంతమైన `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని తమిళంలో 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతున్నాడు తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్. బనిత సంధు హీరోయిన్గా నటిస్తోంది.
మొదట ఈ సినిమాను బాలా దర్శకత్వంలో తెరకెక్కించగా.. అవుట్‌పుట్ అనుకున్న విధంగా రాకపోవడం వల్ల దాన్ని పక్కకు పెట్టేశారు. అనంతరం ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సందీప్ వంగా శిష్యుడు గిరీసాయకు అప్పగించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలా రూపొందించిన 'వర్మ'తో పోల్చితే గిరీసాయ 'అర్జున్‌రెడ్డి' ఆత్మను అందిపుచ్చుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రైలర్ చూస్తుంటే ధృవ్ ఈ పాత్ర కోసం తన వంతు కృషి చేశాడనే అనిపిస్తోంది. కానీ, కొన్నిచోట్ల అతను ఆ పాత్రకు సరితూగలేదోమో అన్నట్లు ఉంది. ఇక బనిత సంధు నటన ఫర్వాలేదనిపించింది. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను చూస్తుంటే మాతృకను ఎక్కడా పక్కదారి పట్టించకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొస్తున్నట్లుగా అర్థమవుతోంది. గిరీసాయ మేకింగ్ స్టైల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. ఆర్ఆర్ఆర్: తారక 'భీముడి' తొలి దర్శనం నేడే!