బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు చెప్పింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం గురించి ఫాలోవర్లతో మాట్లాడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"హాయ్, నేను డిప్రెషన్‌కు గురయ్యాను. ఇది నాలుగేళ్ల నుంచి సాగుతోంది. వైద్యుడి సలహాలు తరచుగా తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఏడాది నుంచి మానసిక ఆరోగ్యం కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఎంతోమంది తమ మనసులోని విషయాల్ని చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయాలన్నీ నిజంగా గందరగోళంగా, ఒత్తిడితో ఉన్నాయి. అయితే వీటన్నింటిని పరిష్కారంగా కనుగొన్నాను. అందులో భాగంగా మనమంతా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుదాం" -ఇన్‌స్టాలో ఐరా ఖాన్ వీడియో
గత కొంతకాలంగా పలురకాల పనులు చేస్తూ బిజీగా ఉంది ఐరా. లాక్డౌన్లో టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంది.