ప్రముఖ నటి ఇలియానా చాలా రోజులు వెండితెరకు దూరమైంది. ఓ విదేశీయుడితో ప్రేమలో పడ్డ ఈ భామ.. ఆయనతోనే చాలా రోజులు విదేశాల్లో గడిపింది. ఇటీవల అనూహ్యంగా అతనితో సంబంధాలు తెంచుకుని తిరిగి వెండితెరపై సందడి చేసింది. రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో నటించింది. తాజాగా మెగాస్టార్ చిత్రంలో ఓ పాత్ర కోసం రేసులో ఉందట.
దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం... ఇందులో పాత్రల కోసం విజయశాంతి, ఐశ్వర్యరాయ్, ఇలియానా వంటి ప్రముఖ నటులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బరువు తగ్గేందుకు...
తెలుగు సినీ పరిశ్రమలోకి ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చినా... ఆమె బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు రావట్లేదట. ఈ కారణంగా బరువు తగ్గించుకోవాలని కొందరు దర్శకులు సూచించారట. దీంతో ఆమె ఆ పనిలో పడింది. ప్రతిరోజు జిమ్లో వ్యాయామం చేస్తోందట. తాజాగా చిరు సరసన ఛాన్స్ కొట్టేసేందుకు ఈ సుందరి మరింత కష్టపడుతోన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి...'చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి'