ETV Bharat / sitara

'ఇన్​టు ది డార్క్​నెస్' సినిమాకు 'గోల్డెన్ పీకాక్' - మూవీ న్యూస్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియా అంగరంగ వైభవంగా జరిగింది. డానిష్ సినిమా 'ఇన్​టు ది డార్క్​నెస్' గోల్డెన్​ పీకాక్ అవార్డు గెలుచుకుంది.

IFFI: Hybrid-mode movie gala concludes with Danish film 'Into the Darkness' winning top honour
'ఇన్​టు ది డార్క్​నెస్' సినిమాకు 'గోల్డెన్ పీకాక్'
author img

By

Published : Jan 25, 2021, 7:39 AM IST

గోవాలో నిర్వహించిన 51వ ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియా(ఇఫి) చిత్రోత్సవాలు ఆదివారంతో పూర్తయ్యాయి. ముగింపు కార్యక్రమంలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన డానిష్ చిత్రం 'ఇన్​టు ది డార్క్​నెస్' గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కించుకుంది. అండర్స్ రెఫ్న్ దర్శకత్వం వహించారు.

నాజీల ఆక్రమణ సమయంలో డెన్మార్క్​ ప్రజలు ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులను, మానసిక కల్లోలాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడీ అవార్డులో భాగంగా చిత్ర దర్శక నిర్మాతలకు తలో రూ.40 లక్షల నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రం అందించనున్నారు. ఈ ఈవెంట్​లో భాగంగా 244 సినిమాల్ని వేరు వేరు విభాగాల్లో ప్రదర్శించారు. ముగింపు చిత్రంగా కియోషి కురసోవా రాసిన జపనీస్ చారిత్రక నాటకం 'వైఫ్ ఆఫ్ ఎ స్పై'ని ప్రదర్శించారు.

మెరిసిన బ్రిడ్జ్: 51 ఇఫి చిత్రోత్సవాల్లో అసోం దర్శకుడు క్రిపాల్ కలిత స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'బ్రిడ్జ్' చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఏటా బ్రహ్మపుత్ర నది వల్ల వచ్చే వరదలకు అసోంలోని గ్రామీణ ప్రజలు ఎలాంటి ప్రభావితం అవుతున్నారనే విషయాన్ని ఇందులో చూపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.