ETV Bharat / sitara

స్క్రిప్టు సిద్ధమైతే 'రైడ్'​కు సై అంటున్న నాగ్ - నాగార్జున తాజాా సినిమా వార్తలు

బాలీవుడ్​ చిత్రం 'రైడ్'​ను తెలుగులో నాగార్జున చేయబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ తనకు నచ్చిందని, స్క్రిప్టు సిద్ధమైతే తాను రెడీగా ఉన్నానంటూ నాగ్​ ఓ మీడియా సమావేశంలో తెలిపారు.

స్క్రిప్ట్​ సిద్ధమైతే 'రైడ్'​కు సై అంటున్న నాగ్
author img

By

Published : Nov 17, 2019, 3:20 PM IST

మన్మథుడు-2 సినిమా తర్వాత కింగ్​ నాగార్జున మరో చిత్రానికి ఒప్పుకోలేదు. కల్యాణ్‌కృష్ణతో ‘బంగార్రాజు’ మూవీని పట్టాలెక్కిస్తారని వార్తలొచ్చినప్పటికీ అది మరింత ఆలస్యమయ్యేలా కనబడుతోంది. అందుకే ఇటీవలె ఓ కొత్త దర్శకుడికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. వంశీ పైడిపల్లి శిష్యుడు సాల్మన్​ చెప్పిన కథ ఆయనకి నచ్చిందని, త్వరలోనే ఆ సినిమాను సెట్స్​పైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత ఓ బాలీవుడ్​ రీమేక్​లో నటించనున్నారట నాగ్.

అజయ్‌ దేవగణ్‌ హిట్‌ మూవీ రైడ్​ను తెలుగులో నాగ్‌ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పష్టతనిచ్చాడు నాగార్జున.

"ఆఫర్‌ వచ్చిన మాట నిజమే. కానీ, స్క్రిప్టు సిద్ధం చేసుకోని కలవమన్నా. ఆ చిత్రాన్ని నేను కూడా చూశా. బాగా నచ్చింది. స్క్రిప్టు పక్కాగా సిద్ధమైతే చేయడానికి అభ్యంతరం లేదు."

-అక్కినేని నాగార్జున, సినిమా హీరో

మొత్తానికి మన్మథుడు మాట్లాడినదాని ప్రకారం చూస్తే.. ఆయన రైడ్‌కి రెడీగానే ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇదీ చూడండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.