బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయం గురించి తెలుసుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. ప్రముఖ న్యాయవాది ఇష్కరణ్ సింగ్ భండారీకి సుశాంత్ కేసు.. సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలనే బాధ్యతను అప్పగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.
ఈ కేసులో పోలీసులు చెబుతున్న విషయాలు సరైనవా.. కాదా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్ చేశారు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ కోసం ఇష్కరణ్ భండారీ ట్విట్టర్ ఫాలో అవ్వాలని సూచించారు.
-
Full video
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Dr Subramanian Swamy on CBI for Sushant Singh Rajput https://t.co/AWMh7iIlya
">Full video
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 11, 2020
Dr Subramanian Swamy on CBI for Sushant Singh Rajput https://t.co/AWMh7iIlyaFull video
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 11, 2020
Dr Subramanian Swamy on CBI for Sushant Singh Rajput https://t.co/AWMh7iIlya
వాంగ్ములాలు సేకరిస్తున్నారు
ప్రస్తుతం సుశాంత్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు, పలువురు సినీ తారలను విచారించి స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
భాజపా ఎంపీ రూపా గంగూలీ, మనోజ్ తివారీ, నటుడు శేఖర్ సుమన్ సహా పలువురు ప్రముఖులు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది చూడండి : సాంకేతిక విప్లవానికి నాంది.. పద్మాలయ స్టూడియోస్