ETV Bharat / sitara

'చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను'

author img

By

Published : Mar 8, 2021, 7:26 AM IST

చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయినట్లు తెలిపారు నటి వరలక్ష్మీ శరత్​కుమార్​. అందుకే బాల్యం నుంచి పిల్లలకు గుడ్‌టచ్‌-బ్యాడ్‌టచ్‌ గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

varalakshmi
వరలక్ష్మీ

ఆమె కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెబుతుంది... అలా మాట్లాడితే తప్పేంటి... అంటుంది... 'నలుగురి కోసం కాదు నీకోసం బతుకు' అని చెబుతుంది... అదే సమయంలో సమాజానికి ఏం చేస్తున్నావో సమీక్షించుకోమంటుంది... ఇది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మనోగతం...

నేను కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు విమర్శించారు. ఇప్పుడు సన్నబడ్డాక 'అయ్యో ఏంటిలా అయిపోయావ్‌' అంటున్నారు. నేనైతే నా కోసం బతుకుతా. నాకు నచ్చినట్లు నేనుంటా. ఎవరి కోసమూ నన్ను నేను మార్చుకోను. డైటింగ్‌ పేరుతో పొట్ట మాడ్చుకోను. పోషక విలువలుండే ఆహారాన్ని తీసుకుంటా. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తా.

సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింసకు తెరపడాలి. ఇందుకోసం భవిష్యత్తులో ఒక సంస్థను ఏర్పాటు చేస్తా. ఎవరైనా అక్కడ ధైర్యంగా ఫిర్యాదు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తా.

సమాజం కోసమే పెళ్లి అంటాను. అది కాగితంపై ఓ సంతకం లాంటిది అంతే.

ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలుంటే పెళ్లి పేరుతో కలిసి ఉండొచ్చు. అలాకాకుండా ఇష్టం లేకపోయినా కలిసి ఉండటంలో అర్థం లేదు. వివాహం కాకుండానే ఇద్దరి అభిప్రాయాలు ఒకటైతే సహజీవనం చేయొచ్చు. అది వారి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

తమిళనాట 32 జిల్లాల్లో ఐదు మహిళా కోర్టులు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ తరహా న్యాయస్థానాలను ఏర్పాటుచేయాలని కోరుతూ 'సేవ్‌ శక్తి' పేరుతో కోర్టులో పిటిషన్‌ వేశా. మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిపై కేంద్ర న్యాయశాఖామంత్రిని కూడా కలిశా. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దీనికోసం రూ.333 కోట్ల బడ్జెట్‌ ఉందని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత 'సేవ్‌ శక్తి' పేరుతో ఎన్జీవోను ప్రారంభించా. వాకథాన్‌, మారథాన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి నిధులు సేకరించా. వాటితో సమస్యల్లో ఉన్నవారికి న్యాయ, ఆర్థిక సాయం చేస్తున్నా.

నేనూ బాధితురాలినే!

చిన్నప్పుడు ఇంట్లో తెలిసినవాళ్లే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తెలిసీతెలియని వయసులో నేను బాధితురాలినయ్యా. అందుకే చెబుతున్నా... బాల్యం నుంచి పిల్లలకు గుడ్‌టచ్‌-బ్యాడ్‌టచ్‌ గురించి చెప్పండి. పైకి మంచిగా ఉన్నవాళ్లే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. స్కూల్స్‌లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. స్వీయరక్షణ నేర్పించాలి.

ఇద చూడండి: 'ప్రభాస్​కు ఫిదా.. ఆయనతో ఒక్క సినిమా అయినా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.