ETV Bharat / sitara

'ఎలా అడుగులు వేయాలో అనుభవాలే నేర్పాయి' - యాక్షన్​, కామెడీ చిత్రాల్లో నటించాలనుంది: నిధి

'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమై.. 'ఇస్మార్ట్​ శంకర్​' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్​. అందంతోనే కాకుండా అభినయంతోనూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుతం ఆమె బెంగళూరులోని తల్లిదండ్రులతో కలిసి సమయాన్ని గడుపుతోంది. ఈ విశ్రాంతి సమయంలో తాను చాలా నేర్చుకుంటున్నానని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పింది.

I want to act in action and comedy movies: Niddhi Agarwal
యాక్షన్​, కామెడీ చిత్రాల్లో నటించాలనుంది: నిధి
author img

By

Published : May 18, 2020, 6:44 AM IST

'ఇస్మార్ట్‌' గాళ్‌...నిధి అగర్వాల్‌. కుర్రకారు మతులు పోగొట్టేంత అందం ఆమె సొంతం. హిందీ చిత్రం 'మున్నామైఖేల్‌'తో వెండితెరపై అరంగేట్రం చేసింది. 'సవ్యసాచి'తో తెలుగులోకి అడుగు పెట్టింది. 'మిస్టర్‌ మజ్ను', 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రాలతో సందడి చేసింది. త్వరలోనే మరిన్ని చిత్రాలతో అలరిస్తానంటోంది. ప్రస్తుతం బెంగళూరులో గడుపుతున్న నిధితో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలివీ...

I want to act in action and comedy movies: Niddhi Agarwal
నిధి అగర్వాల్​

కెరీర్‌ మొదలైన తక్కువ సమయంలోనే మూడు భాషల్లోకి అడుగు పెట్టారు. ఆయా భాషల్లో వాతావరణం ఎలా ఉంది?

నేను హైదరాబాద్‌లో పుట్టాను. బెంగళూరులో పెరిగాను. తర్వాత ముంబయికి మారిపోయాను. భిన్నమైన సంస్కృతులతో పరిచయం ఉంది. కాకపోతే భాషతోనే కొంచెం కష్టం. అయినా తెలుగు బాగా మాట్లాడేస్తున్నా. తమిళం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇప్పుడంటే బెంగళూరులో ఇంట్లో ఉన్నాను కానీ, ఐదు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశానంటే తెలుగు ఇంకా బాగా మాట్లాడేస్తా. తెలుగులో మూడు సినిమాలు చేశాను కాబట్టి సెట్స్‌లో మాట్లాడుతూనే భాష నేర్చుకున్నా. లాక్‌డౌన్‌ విరామంలో తమిళం, తెలుగు సినిమాలు చూడటమే నా పని. పాటలూ వింటున్నా. అయితే తెలుగు ఈమధ్యే నేర్చుకున్నాను కదా, ఇంతలోనే మరో కొత్త భాష తమిళం నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల కొన్నిసార్లు గందరగోళంగానూ ఉంటుంది.

2020 కోసం చాలా ప్రణాళికలే వేసుకుని ఉంటారు కదా...

చాలా అంటే చాలా (నవ్వుతూ). గతేడాది అస్సలు ఖాళీనే లేదు. చిత్రీకరణల కోసం బోలెడన్ని ప్రయాణాలు చేశాను. అందుకోసం 163 విమానాలు మారాను. ఈ ఏడాదీ అంతే హుషారుగా మొదలైంది. మే 1కి నా సినిమాల్లో ఒకటి విడుదల కావల్సింది. కానీ ఊహించని రీతిలో కరోనా ప్రభావం మొదలైంది. నావే కాదు, అందరి ప్రణాళికలూ తలకిందులయ్యాయి. నా కెరీర్‌ మొదలైన రెండున్నరేళ్ల తర్వాత వచ్చిన సుదీర్ఘవిరామమిది.

లాక్‌డౌన్‌కి ముందు రెండు రోజులు ఎలా గడిచాయి?

నాకు ఆ రెండు రోజులే గుర్తొస్తున్నాయి (నవ్వుతూ). మళ్లీ అలా స్వేచ్ఛగా బయట గడిపే అవకాశం ఎప్పుడొస్తుందో! ఆరోజు చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చి తిరిగి ముంబయి వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చా. అప్పుడే లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో బెంగళూరుకి నాప్రయాణాన్ని మార్చుకుని ఇంటికొచ్చేశా.

నిధి అగర్వాల్

ముంబయికి ఎందుకెళ్లాలనుకున్నారు?

నేను అక్కడే ఉంటాను. 2017లో సినిమా కెరీర్‌ కోసం నేను ముంబయికి మారిపోయా. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. లాక్‌డౌన్‌ ఎన్ని రోజులో తెలియదు కదా, ఒంటరిగా ఉండటం ఎందుకని బెంగళూరుకు వచ్చేశా.

ఈ విరామంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి?

ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనితో గడిపే ప్రయత్నం చేస్తున్నా. బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. రెండు రోజుల ముందు కొంచెం గొంతు నొప్పి వచ్చింది. దాంతో... 'ఏమైంది నాకు, ఇప్పుడు ఏం చేయాలి' అనిపించింది (నవ్వుతూ). ఇది నా ఒక్కదాని సమస్యే కాదు, అందరిదీ. నేనైతే ఇంట్లో ఉన్నాను. కుటుంబం, పెంపుడు కుక్క ఇలా అన్నీ ఉన్నాయి. కానీ బయట ఎంతో మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ల కోసం నా వంతుగా 6 ఛారిటీలకి నా పరిధిలో సాయం చేశా. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా.

'ఇస్మార్ట్‌ శంకర్‌' విజయాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నారు?

నా జీవితంలో ఓ మంచి మలుపు ఆ సినిమా. నాకు పెద్ద హిట్టు రావడం సహా పూరి సార్‌, ఛార్మి, రామ్‌ లాంటి మంచి వ్యక్తులతో అనుబంధం పెరిగింది. ఇప్పుడు వాళ్లు నాకు మంచి స్నేహితులు. హిట్టు సినిమా అయినా, ఫ్లాప్‌ అయినా నటులు మంచి అభినయమే ప్రదర్శిస్తారు. కాకపోతే ఆ సినిమా హిట్టయితే నటుల కెరీర్‌కి ప్లస్‌ అవుతుంది. అది నటులకి చాలా అవసరం. ఈ ప్రయాణంలో నేను గమనించిన మరో విషయం ఏమిటంటే... తొలి సినిమా నుంచి ఫలితంతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో హిట్టు ట్యాగ్‌ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మరింత హ్యాపీ.

ఇప్పటిదాకా చేసిన పాత్రలతో సంబంధం లేకుండా, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలు వస్తుంటాయా?

నాకు చారిత్రక నేపథ్య సినిమాలంటే చాలా ఇష్టం. నిర్దేశితమైన కాలంలో సాగే ఆ కథల్లో కనిపించే సెట్లు, ఆ గెటప్పులు నన్ను బాగా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తే చేయాలని ఉంది. అలాగే ఓ యాక్షన్‌ సినిమాలోనూ నటించాలని ఉంది. యాక్షన్‌లో నాకు ప్రావీణ్యం ఉంది. నా తొలి హిందీ సినిమాని టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి చేశాను. తనతో కలిసి పోరాటాల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నా. ఆ కళని ఎప్పుడెప్పుడు బయట పెడదామా అనిపిస్తోంది. కామెడీ అన్నా నాకు చాలా ఇష్టం. తమిళంలో చేసిన 'భూమి'లో నా పాత్ర మంచి వినోదం పండిస్తుంది. తెలుగులోనూ అలాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో అశోక్‌ గల్లాతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకున్నా. హిందీ, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నా.

"చిత్ర పరిశ్రమ అర్థం కావడానికి నాకు కొంచెం సమయం పట్టింది. మా కుటుంబంలో ఎవ్వరూ సినీపరిశ్రమలో లేరు. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలా అడుగులు వేయాలో అనుభవాలే నేర్పాయి. కొన్నిసార్లు చెడు అనుభవాలూ ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఇలా ఎందుకు జరిగింది? ఇంత కష్టపడుతున్నా కదా? అనిపిస్తుంటుంది. ఒక తప్పు జరిగాకే, దాన్నుంచి ఒక పాఠం నేర్చుకుంటాం కదా. అలా నేనూ నేర్చుకుంటున్నా"

ఇదీ చూడండి.. 24 గంటల్లోనే షార్ట్ ఫిల్మ్.. ఆకట్టుకున్న పాయల్ నటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.