తాప్సీ.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే గతంలో తనకు గురుద్వారాలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుందీ నటి. ఆ అనుభవంతో తాను ఎంతో దృఢంగా మారానని తెలిపింది.
"గురుపూరబ్ సమయంలో గురుద్వారా వెళతా. అయితే ఓసారి మేము గురుద్వారాకు వెళ్లినపుడు ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. నాకు బాగా గుర్తుంది ఆరోజు అక్కడ చాలా మంది జనం ఉన్నారు. వారికి ఆహారం అందించడానికి చాలా దుకాణాలు ఉన్నాయి. అక్కడ వరుసలో నిల్చున్న వారు తోసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు పడుతున్నారు. అంత మంది జనం ఉన్నారు అంటే నన్ను తాకేందుకు ప్రయత్నిస్తారని ముందే ఊహించా. ఓ వ్యక్తి నన్ను వెనక నుంచి తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే నేను అతని చేతి వేలు విరిచేశా. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను."
- తాప్సీ, నటి
తాప్సీ ప్రస్తుతం అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 'తప్పడ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇది ఫిబ్రవరి 28న విడుదలవనుంది. 'రష్మి రాకెట్' అనే మరో సినిమాలోనూ ఈ భామ నటిస్తోంది. ఇందులో ఆమె గుజరాత్‌కు చెందిన ఫాస్ట్ రన్నర్ రష్మీ పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చదవండి: మొన్న మోదీ.. నిన్న రజనీ.. నేడు అక్షయ్