బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ ఆశ్చర్యకర విషయం చెప్పారు. ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని వెల్లడించారు. సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌తో లైవ్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
'ఇన్‌టూ ది వైల్డ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత బేర్ గ్రిల్స్‌తో కలిసి అడవిలో సాహసాలు చేశారు అక్షయ్. ఆ ఎపిసోడ్ నేడు(సెప్టెంబరు 11) ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్‌గ్రిల్స్‌తో కలిసి గురువారం లైవ్ చాట్ నిర్వహించారు. అక్షయ్‌తో పాటు హీరోయిన్లు హ్యుమా ఖురేషి, లారా దత్తా పాల్గొన్నారు. ప్రస్తుతం 'బెల్ బాటమ్' షూటింగ్ కోసం వీరందరూ స్కాట్లాండ్లో ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఏనుగు మలంతో చేసిన సూప్ ఎలా తాగారు?" అని హ్యుమా అక్షయ్‌ను అడగ్గా.. "అది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యం నిమిత్తం, ప్రతిరోజు నేను గోమూత్రం తాగుతాను" అని చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో అక్షయ్‌తో తనకు ఎదురైన అనుభవాల్ని పంచుకున్నారు బేర్‌గ్రిల్స్. ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి అతడని అన్నారు. ఇప్పటివరకు తన షోకు వచ్చిన వారిలో ఫిట్నెస్ పరంగా అక్షయ్ టాప్‌లో ఉంటాడని చెప్పారు.