జానపదం, పౌరాణికం, యాక్షన్, లవ్, సోషియో ఫాంటసీ ఇలా ఏ జోనర్ కథలైనా, అందులోని పాత్రల్లోకి పరకాయప్రవేశం చేస్తారు నటసింహం నందమూరి బాలకృష్ణ. 'తాతమ్మ కల' నుంచి 'రూలర్' వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విభిన్న కథాంశాలు గల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మరి ఇలాంటి గొప్ప నటుడు తాను నటించే కథలను ఎలా ఎంచుకుంటారు? అన్న ఆలోచన చాలా మంది అభిమానులకు తలెత్తుతుంది. అయితే ఇదే విషయంపై బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"కథ వినే క్రమంలో ప్రేక్షకులను మెప్పించే ప్రతి అంశాన్ని పరిశీలిస్తా. కానీ, కొన్నిసార్లు స్టోరీలైన్ నన్ను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో కథ, పాత్ర స్వభావానికి భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ చివరిగా వచ్చే అవుట్‌పుట్‌పై ఆధారపడి ఉంటాయి".
-బాలకృష్ణ, కథానాయకుడు
బాలకృష్ణ తన 60వ జన్మదినం సందర్భంగా స్వయంగా పాడిన ఓ పాటను అభిమానులతో పంచుకోనున్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 5:03 నిమిషాలకు దానిని విడుదల చేయనున్నారు. దీంతో పాటే బోయపాటి-బాలయ్య కాంబోలో రానున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఈరోజు సాయంత్రం 7: 09 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి... కాసేపట్లో.. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ