ETV Bharat / sitara

'ఆ సినిమాతో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకం'

'గ్యాంగ్స్​ ఆఫ్ వస్సీపూర్​ 2' అనుభవాలను ఇన్​స్టాలో పంచుకున్న నటి హ్యూమా ఖురేషి..​ తన కెరీర్​లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనదని తెలిపింది.

Huma Qureshi
ఖురేషి
author img

By

Published : Aug 10, 2020, 6:20 AM IST

తను నటించిన సినిమాల్లో 'గ్యాంగ్స్​ ఆఫ్​ వస్సీపూర్​​ 2' ఎంతో ప్రత్యేకమైందని చెప్పింది బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. ఈ చిత్రానికి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా, షూటింగ్​లో తన అనుభవాలను గుర్తుచేసుకుంది.

"ఆరోజు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. నిజంగా అనురాగ్ కశ్యప్​​తో ప్రయాణం మర్చిపోలేనిది. మీరు ఎప్పటికీ నాకు ప్రత్యేకమైన వ్యక్తే. అనురాగ్​ మళ్లీ త్వరలో మీ సినిమాలో నటించాలని ఉంది. మనం మరోసారి కలిసి పనిచేద్దాం. నవాజుద్దీన్ సిద్ధిఖీ.. మీతో కూడా మళ్లీ నటించాలని ఉంది" అని ఖురేషి తెలిపింది.

క్రైమ్​​ కథతో రెండు భాగాలుగా తీసిన ఈ సినిమాకు అనురాగ్​ కశ్యప్​ దర్శకుడు. నవాజుద్దీన్​ సిద్దిఖీ, రిచా చద్దా రెండో భాగంలో నటించారు. హ్యూమా ప్రస్తుతం 'బెల్​బాటమ్​'లో నటిస్తోంది. చిత్రీకరణ కోసం త్వరలో లండన్ వెళ్లనుంది. ఈ సినిమాలో అక్షయ్​ కుమార్​, వాణీ కపూర్​, లారా దత్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.