బాలీవుడ్ ప్రముఖులు ఒకొక్కరిగా హాలీవుడ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కథానాయిక హ్యూమా ఖురేషి ఆ జాబితాలో చేరింది. జాంబీ జోనర్ యాక్షన్ కథతో తెరకెక్కుతోన్న హాలీవుడ్ చిత్రం 'ఆర్మీ ఆఫ్ ది డెడ్'. ఇందులో హ్యూమా ఓ కీలక పాత్రలో నటించింది.
జాక్ సైండర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 21న థియేటర్, ఓటీటీల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
"మంచి దర్శకుడైన జాక్ సైండర్ సినిమాలో ఓ భాగం కావడం చాలా ఆనందంగా ఉంది."
- హ్యూమా ఖురేషి, కథానాయిక
ప్రతి పాత్రను ఆలోచించి ఎంచుకునే హ్యూమా.. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఆమె ప్రస్తుతం తమిళ చిత్రం 'వలిమై'తో పాటు అక్షయ్ 'బెల్‌బాటమ్'లో కీలకపాత్రలో నటిస్తోంది.
ఇదీ చూడండి: 'ఇష్క్'.. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి!