ETV Bharat / sitara

వారి ఆకలి తీర్చేందుకు హీరో హృతిక్ రోషన్ సాయం - కరోనా వార్తలు

ప్రముఖ హీరో హృతిక్ రోషన్.. అక్షయపాత్ర సేవాసంస్థతో కలిసి, ఆకలితో ఇబ్బందులు పడుతున్న లక్ష 20వేల మందికి ఆహారం అందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించాడు.

వారి ఆకలి తీర్చేందుకు హీరో హృతిక్ రోషన్ సిద్ధం
హీరో హృతిక్ రోషన్
author img

By

Published : Apr 7, 2020, 6:46 PM IST

భారత్​లో లాక్​డౌన్ సమయంలో వృద్ధులు, రోజువారి కార్మికులు, అల్ప ఆదాయ వర్గాల వారు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. తాజాగా వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అక్షయ పాత్ర ఫౌండేషన్​తో కలిసి, ప్రతిరోజూ లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకుందీ సంస్థ.

"సూపర్​స్టార్ హృతిక్​రోషన్​తో కలిసి ఈ సాయం చేయనుండటం మా సంస్థకు సంతోషమైన విషయం. కరోనా ప్రభావం తగ్గేవరకు వృద్ధాశ్రమాలకు, రోజువారి కార్మికులకు, అల్పఅదాయవర్గాల వారికి.. లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయబోతున్నాం. మాతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిన హృతిక్​కు హృదయపూర్వక ధన్యవాదాలు" -అక్షయపాత్ర ఫౌండేషన్ ట్వీట్

ఈ విషయంపై స్పందించిన హృతిక్.. ఈ సంస్థ, అందులో పనిచేస్తున్న వారే 'రియల్ సూపర్​ హీరోస్' అంటూ ప్రశంసించాడు.

hritik roshan tweets
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ట్వీట్లు

"ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూస్తారని భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో భాగమైన మీరే రియల్ సూపర్​ హీరోస్. మనకు వీలైనంత సాయం చేద్దాం. వాటిలో ఎక్కువ తక్కువ తేడాలు లేవు" -హృతిక్ రోషన్ ట్వీట్

ఇలానే మంబయి మున్సిపల్ కార్మికుల కోసం మాస్క్​లు తయారు చేయనున్నట్లు గత నెలలో ప్రకటించాడు హృతిక్. త్వరలో వాటిని అందజేయనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.