నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. తన మాజీ భార్య సుస్సానే, ఇద్దరు కుమారులు ఇతడితో కలిసే ఉంటున్నారు. తాజాగా ఆ చిన్నారులతో కలిసి బాల్కనీలో హృతిక్ ముచ్చటిస్తున్న ఓ వీడియోను సుస్సానే ఇన్స్టాలో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ప్రస్తుత ప్రపంచంలో ఓ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఆస్వాదించడానికి మనకు సమయం లేదు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏమిటి ఈ జీవితం? కనీసం ఎక్కడికి పరుగెడుతున్నామో తెలీదు. " అంటూ రాసుకొచ్చింది సుస్సానే.
2014లో విడాకులు తీసుకున్న హృతిక్ , సుస్సానే.. లాక్డౌన్ వల్ల పిల్లల కోసం మళ్లీ ఒక చోటుకు చేరారు. అంతకుముందు మాట్లాడుతూ.. తన భార్య, పిల్లల్ని మరోసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇన్స్టాలో రాసుకొచ్చాడు హృతిక్.
ఇదీ చూడండి : మళ్లీ హృతిక్ రోషన్ దగ్గరకొచ్చిన అతడి మాజీ భార్య