ETV Bharat / sitara

'ఉప్పెన'లో కృతి అలా ఎంపికైంది

author img

By

Published : Feb 22, 2021, 10:28 AM IST

ఒకరు నటించాల్సిన సినిమాలో మరొకరు నటించడం చిత్ర పరిశ్రమలో సర్వ సాధారణం. కొన్నిసార్లు ఓ కథానాయికతో సినిమా మొదలవుతుంది.. పలు కారణాల వల్ల మరో నాయికతో ఆ చిత్రం విడుదలవుతుంది. 'ఉప్పెన' సినిమాకు సంబంధించి కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. ఇంతకీ ఈ చిత్రంలో ఆమె ఎలా ఎంపికైందంటే?

kriti
కృతి

'ఉప్పెన' ప్రేక్షకులకు చేరువకావడంలో నాయిక కృతి శెట్టి ప్రధాన కారణమని చెప్పొచ్చు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువ మనసుల్ని కొల్లగొట్టి 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్‌ ధక్‌ ధక్‌' అంటూ పాటలతోనే ఫిదా చేసేసింది. అంతే.. ఈ ముద్దుగుమ్మను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆశగా ఎదురు చూశారు సినీ ప్రియులు. ఇటీవలే సినిమా విడుదలైంది.. బేబమ్మగా కనిపించి ఆకట్టుకుంటోంది కృతి. తొలి పరిచయంలోనే అగ్ర కథానాయిలకు ఉండే ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అన్నింటికీ కారణం ఆ పాత్రలో ఒదిగిపోవడం. అసలు ఈ బేబమ్మ పాత్ర కృతికి ఎలా దక్కిందో తెలుసా?

సముద్రం నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ఈ ప్రేమ కథలో తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. అనుకున్నట్టుగానే మనీషా అనే తెలుగమ్మాయిని ఎంపిక చేశారు. పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. మరోవైపు అదే సమయంలో దర్శకుడు బుచ్చిబాబు కృతి ఫొటోలు చూశారు. దాంతో సందిగ్ధంలో పడిన ఆయన తన గురువు, దర్శకుడు సుకుమార్‌ను కలిసి విషయం చెప్పారు.

"నీ కన్నా.. నా కన్నా సినిమా గొప్పది. దానికి అన్యాయం చేయకూడదు. దర్శకుడిగా నువ్వు తీసుకునే నిర్ణయమే సరైంది. కొత్త అమ్మాయినే తీసుకో" అని సలహా ఇచ్చారట. 'ఈ మాట విన్న వెంటనే కృతి శెట్టిని పిలిపించాను. చూడగానే బాగుంది. బేబమ్మ పాత్రకు సరిపోతుందనిపించింది. అయినా తెలుగు అమ్మాయి కాకవడం వల్ల అనుకున్న విధంగా చేయగలుతుందా? అనే ఆలోచన మదిలో మెదిలింది. అయినా ధైర్యం చేసి ముందుకెళ్దామని ఫిక్స్‌ అయ్యా. కృతి కూడా కష్టపడి తనెంటో నిరూపించుకుంది" అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు బుచ్చిబాబు.

ఇదీ చూడండి: 'తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.