ETV Bharat / sitara

'కేజీఎఫ్​' దర్శకుడి కథతో రానున్న 'బఘీరా'

author img

By

Published : Dec 17, 2020, 2:54 PM IST

'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కథనందించిన కొత్త చిత్రం 'బఘీరా'. కన్నడ నటుడు శ్రీమురళి హీరోగా చేస్తున్న ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను నేడు విడుదల చేసింది చిత్రబృందం.

hombale films new movie is titled as bagheera
కేజీఎఫ్​ దర్శకుడి కథతో రానున్న 'బఘీరా'

కన్నడ నటుడు శ్రీమురళి, ప్రముఖ దర్శకుడు డాక్టర్‌ సూరితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​ ప్రకటించింది. చిత్రానికి 'కేజీఎఫ్'‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథను సమకూర్చారు. 'సమాజం అడవిగా మారినప్పుడు.. న్యాయం కోసం ఒకే ఒక ప్రిడేటర్ గర్జిస్తుంది!' అంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్​లో పేర్కొంది. శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. చిత్రానికి 'బఘీరా' అనే పేరు పెట్టి పోస్టర్​ను విడుదల చేసింది.

ఇప్పటికే 'కేజీఎఫ్2'‌ చిత్రంతో పాటు ప్రభాస్‌ నటిస్తున్న 'సలార్' చిత్రాలను రూపొందిస్తున్నారు నిర్మాత విజయ్‌ కిరాగండూర్‌.'ఇంత అద్భుతమైన చిత్రబృందంతో కలిసి పనిచేస్తున్నందుకు నేనెంతో గొప్పగా ఫీలౌతున్నా. సినిమా కోసం ఎప్పట్నించో ఎదురుచూస్తున్నా. చిత్రం ప్రారంభం అయ్యే వరకు వేచి ఉండలేకపోతున్నా. ప్రస్తుతం 'మదగజ' చిత్రం షూటింగ్‌ చేస్తున్నా' అంటూ శ్రీ మురళి హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ప్రభాస్​ 'సలార్' టైటిల్​ అర్థం ఇదే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.