ETV Bharat / sitara

'పఠాన్'​ కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్స్​ - షారుక్​ దీపికా పదుకొణె

బాలీవుడ్​ బాద్షా షారుక్ ఖాన్​, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పఠాన్​'. నటుడు జాన్​ అబ్రహం ఇందులో ప్రతినాయక పాత్ర పోషించనున్నారు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​ భారీ యాక్షన్​ సీక్వెన్స్​ ప్లాన్​ చేశారట. దీని కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్లు పనిచేయనున్నారు.

Hollywood stunt directors for Shahrukh Khan's Pathan movie
'పఠాన్'​ కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్స్​!
author img

By

Published : Apr 10, 2021, 7:24 AM IST

షారుక్ ఖాన్ చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం 'పఠాన్​'. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్​గా ఎంపికవ్వగా.. నటుడు జాన్​ అబ్రహం ఇందులో విలన్​గా నటించనున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. యాక్షన్ చిత్రాల్ని అత్యాధునిక హంగులతో ఖర్చుకు వెనకాడకుండా నిర్మించే సంస్థ యశ్​రాజ్​ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం వల్ల అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ చిత్రంలో షారుక్​, దీపిక, జాన్ అబ్రహం మధ్య సన్నివేశాలు ఈ చిత్రంలో కీలకంగా నిలవనున్నాయట. అందులోనూ యాక్షన్ సీన్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయట. దాని కోసం చిత్రబృందం భారీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని యాక్షన్ సీక్వెన్స్​ ఇందులో ఉంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'వార్' చిత్రంలో ఆర్కిటిక్ ప్రాంతంలో తీసిన కారు గేమింగ్ సీన్లు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. వాటిని మించేలా 'పఠాన్‌'లో పోరాట ఘట్టాలు ఉండనున్నాయట. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు కోసం ఎక్కువ రోజులు చిత్రీకరణ చేయనున్నారు. ఇప్పటికే బుర్జ్​ ఖలీఫాలో కొన్ని సన్ని వేశాల చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం.

హాలీవుడ్ యాక్షన్ దర్శకులు..

'పఠాన్' కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్​ డైరెక్టర్లు రంగంలోకి దిగారు. 'ఎడ్జ్ ఆఫ్ టుమారో', 'బ్లేడ్ రన్నర్ 2049' లాంటి చిత్రాలకు స్టంట్​ డైరెక్టర్​గా పనిచేసిన కేజీ ఓ నెయిల్, 'మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్​ ప్రొటోకాల్', 'టాప్​గన్ మేవరిక్' తదితర చిత్రాలకు పనిచేసిన యాక్షన్ దర్శకుడు డొమోంకోస్ పర్ణానీలు 'పఠాన్'లోని యాక్షన్ ఘట్టాలను తీర్చిదిద్దుతున్నారు.

సెకండ్ వేవ్ తంటా..

కరోనా రెండో దశ విజృంభణతో బాలీవుడ్ తీవ్ర ఆందోళనలో ఉంది. భారీ చిత్రాల చిత్రీకరణలు ఆగాయి. 'పఠాన్' సినిమాకూ ఈ ప్రభావం తగిలింది. ఈ సినిమాలోని కొన్ని కీలక ఘట్టాల కోసం ముంబయిలో ప్రత్యేకమైన సెట్​ను తీర్చిదిద్దుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో సెట్ నిర్మాణం ఆలస్యం అయ్యేలా ఉందని సమాచారం. ఈ సెట్ నిర్మాణం కోసం 250 మంది వర్కర్లు అవసరం. ఎక్కువమంది కలిసి పనిచేసే పరిస్థితి లేకపోవడం అతి తక్కువ మందితో సెట్ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతున్నాయి.

ఇదీ చూడండి: మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో పూజాహెగ్డే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.