ETV Bharat / sitara

'స్టార్​వార్స్'​కు నటుడు జాన్​ బొయేగా గుడ్​బై - John Boyega moving on

హాలీవుడ్​ నటుడు జాన్​ బొయేగా ప్రముఖ సైన్స్​ ఫిక్సన్​ సిరీస్​ 'స్టార్​ వార్స్'​ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఒకటే రోల్​ ఎక్కువ రోజులు పోషించడం ఇష్టంలేక ఫ్రాంచైజీని విడిచిపెడుతున్నట్లు తెలిపాడు.

John Boyega
'స్టార్​వార్స్'​కు గుడ్​బై చెప్పేసిన జాన్​ బొయేగా
author img

By

Published : Jul 21, 2020, 10:12 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుని కాసులు కురిపించిన 'స్టార్‌వార్స్‌' సినిమాలో కీలక పాత్రల్లో ఒకడు జాన్‌ బొయేగా. అసలు పేరు జాన్‌ అడెడయో బి.అడెగ్బోయెగా. ఇంగ్లీష్‌ నటుడు. హాలీవుడ్‌లో చిరపరిచితుడు. ఈ నటుడు తాజాగా స్టార్​వార్స్​ సిరీస్​ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఒకటే పాత్రలో ఎక్కువ రోజులు నటించడం ఇష్టం లేక ఫ్రాంచైజీని వీడుతున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పటివరకు ఈ సిరీస్​లోని మూడు సినిమాల్లో నటించాడు.

2015లో స్టార్​వార్స్​ ఫ్రాంచైజీలో అడుగుపెట్టిన జాన్​... 'ద ఫోర్స్​ ఎవేకెన్స్'​, 'ద లాస్ట్​ జేడీ', 'ద రైజ్​ ఆఫ్ ​స్కై వాకర్'​లో నటించాడు.

వీటితో పాటు 'ఎటాక్‌ ద బ్లాక్‌', 'డెట్రాయిట్‌'’, 'పసిఫిక్‌ రిమ్‌ అప్‌రైజింగ్‌', 'ఇంపెరియల్‌ డ్రీమ్స్‌' లాంటి సినిమాలు సహా పలు టీవీ సిరీస్‌ల్లో కూడా మంచి నటుడిగా ఆకట్టుకున్నాడు బొయేగా. ప్రతిష్ఠాత్మకమైన బాఫ్టా రైజింగ్‌ స్టార్‌ అవార్డ్​నూ‌ అందుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.