ETV Bharat / sitara

'హ్యారీ పోటర్​' హీరో డేనియల్​కు కరోనా? - డానియల్​ రాడ్క్లిఫ్​

ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్​ ర్యాడ్​క్లిఫ్​కు కరోనా వైరస్​ సోకిందని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ స్టార్​ హీరో సన్నిహితులు అవి పుకార్లని కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.

Hollywood Actor Daniel Radcliffe denies suffering from Corona Virus(Covid-19)
'హ్యారీ పోటర్​' హీరో డానియల్​కు కరోనా..?
author img

By

Published : Mar 11, 2020, 6:13 PM IST

'హ్యారీ పోటర్​' సిరీస్​తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు డేనియల్​ ర్యాడ్​క్లిఫ్​. హీరోగానే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించాడు ఈ హాలీవుడ్​ హీరో. ఇటీవల అతడికి కరోనా వైరస్​ సోకిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం రాసింది. అది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దానిపై తాజాగా డేనియల్ సన్నిహితులు​ స్పందించినట్లు సమాచారం.

ప్రస్తుతం డేనియల్​కు ఎలాంటి వైరస్​ సోకలేదని.. క్షేమంగానే ఉన్నాడని వాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. అతడి మీద వచ్చిన వార్తలు పుకార్లని స్పష్టం చేయగా.. ఆ మీడియా సంస్థ తన పోస్టును తొలగించింది. ఇప్పటికే ఈ వైరస్​ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 మంది మరణించగా.. లక్షా పదమూడు వేలమంది చికిత్స పొందుతున్నారు. ​

ఇదీ చూడండి.. బాబూ.. నేపాల్​ గ్రామం కాదయ్యా దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.