ETV Bharat / sitara

'లైగర్'​ కోసం హాలీవుడ్ యాక్షన్​ కొరియోగ్రాఫర్​ - liger vijay devarakonda

పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న 'లైగర్​' కోసం హాలీవుడ్​ యాక్షన్​ కొరియోగ్రాఫర్​ ఆండీ లాంగ్​​ రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని చిత్ర సహనిర్మాత చార్మి తెలిపారు.

liger
లైగర్​
author img

By

Published : Apr 6, 2021, 5:58 PM IST

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో పాన్​ఇండియా సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'లైగర్​'. ఇందులో బాక్సర్​గా విజయ్​ కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్​ యాక్షన్​ కొరియోగ్రాఫర్​ ఆండీ లాంగ్​, అతడి బృందం రంగంలోకి దిగినట్లు తెలిపారు ఈ చిత్ర సహ నిర్మాత చార్మి. 'హై వోల్టేజ్​ యాక్షనర్​ ఆన్​ ట్రాక్​' అంటూ వ్యాఖ్య జోడించారు. ఆండీ లాండ్..​ జాకీచాన్​ సినిమాలు సహా ఎన్నో హాలీవుడ్​ హిట్​ చిత్రాలకు పనిచేశారు.

బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇందులో విజయ్​ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీసీ కనెక్ట్స్​, ధర్మా ప్రొడక్షన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: విజయ్​ 'లైగర్'​ సినిమాలో ప్రభుదేవా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.