బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేయించాలని, కేసు సీబీఐకి అప్పగించాలని అతడి తండ్రి కేకేసింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరారు. ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగపు సందేశాన్ని పోస్ట్ చేసారు.
"నా కుమారుడుకు న్యాయం జరగకపోవడం వల్ల ఆవేదనతో అతని ఆత్మ క్షోభిస్తోంది. అయినా నా కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. చాలా ధైర్యవంతుడు. ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండడు. ఎవరో అతడిని చంపి.. ఆత్మహత్యగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. దయచేసి దీనిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాను" అంటూ రాసుకొచ్చారు.
![susanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/b5fa5afea5536eec24f3d98dd4ca037e_0407newsroom_1593860709_23.jpg)
సుశాంత్ మృతిపై ఇప్పటికే 30 మందికి పైగా విచారించి వారి వాంగ్ములాలను సేకరించారు పోలీసులు. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసును ముమ్మరంగా ఛేదించేలా సీబీఐకి బదిలీ చేయాలని సుశాంత్ అభిమానులు సహా పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చూడండి :
- చనిపోయేముందు సుశాంత్ గూగుల్లో ఏం వెతికాడంటే?
- 'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్'
- ప్రేయసి, నిర్మాణ సంస్థల చుట్టూ సుశాంత్ కేసు
- చనిపోయే మూడు రోజుల ముందే స్టాఫ్కు సుశాంత్ జీతాలు!
- 'సుశాంత్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా'
- సుశాంత్, రియా పెళ్లి చేసుకోవాలనుకున్నారు!
- 'సుశాంత్ మరణానికి కారణమేంటో నాకు తెలుసు'
- ఏడు సినిమాలు కోల్పోయిన సుశాంత్.. కారణమిదే!